Share News

iPhone 17 Series: టెక్ ప్రియులకు అప్‎డేట్.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:51 PM

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆపిల్ తన కొత్త iPhone 17 సిరీస్‎ని సెప్టెంబర్ 9న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది. iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Airని అదే రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుందని తెలుస్తోంది.

iPhone 17 Series: టెక్ ప్రియులకు అప్‎డేట్.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.
iPhone 17 Series

ఆపిల్ ఫ్యాన్స్ కోసం కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 series) లాంచ్ డేట్ ఫిక్సైంది. సెప్టెంబర్ 9న ఆపిల్ తన కొత్త ఐఫోన్ లైనప్‌ని ఆవిష్కరించబోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్ ఉండబోతున్నాయి. అంతేకాదు, సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్స్ కూడా స్టార్ట్ కానున్నాయి. ఈ కొత్త ఐఫోన్‌ల గురించి ధరలు, ఫీచర్స్, ఇంకా మరెన్నో డీటెయిల్స్‌ గురించి ఇక్కడ తెలుసుకుందాం.


ఐఫోన్ 17 సిరీస్ ధరలు

ఈ సారి ఆపిల్ కొత్త ఐఫోన్‌ల ధరల్లో స్వల్పంగా పెంపు ఉండొచ్చని మ్యాక్‌వరల్డ్ రిపోర్ట్ చెబుతోంది. సుమారు $50 అదనంగా ఉండొచ్చు. అమెరికాలో ఐఫోన్ 17 ధర $799 నుంచి స్టార్ట్ కావచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ ధర $949 నుంచి $999 మధ్యలో ఉండొచ్చు. ఐఫోన్ 17 ప్రో ధర $1,049 లేదా 256GB మోడల్‌కి $1,149 వరకూ ఉండే ఛాన్సుంది. ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, దీని ధర సుమారు $1,249గా (రూ. 1,09,385) ఉండవచ్చు.


ఇక యూఏఈలో ధరలు ఇలా ఉండొచ్చు

  • ఐఫోన్ 17: AED 2,934 (సుమారు రూ.69,972)

  • ఐఫోన్ 17 ఎయిర్: AED 3,669 (సుమారు రూ.87,501)

  • ఐఫోన్ 17 ప్రో: AED 4,220 (సుమారు రూ.1,00,641)

  • ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: AED 4,587 (సుమారు రూ.1,09,394)

  • ఇండియా ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఈ రేంజ్‌లోనే ఉండొచ్చని అంచనా


ఐఫోన్ 17 సిరీస్ ఫీచర్స్

ఈ సారి ఐఫోన్ 17 సిరీస్ కొన్ని అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తోంది. ముఖ్యంగా కెమెరా లవర్స్‌కి ఈ ఫోన్ ఓ ట్రీట్ లాంటిది. ఐఫోన్ 17లో 48MP టెలిఫోటో లెన్స్ ఉండబోతోంది, ఇది 8x ఆప్టికల్ జూమ్‌ని అందిస్తుంది. అంటే దూరంగా ఉన్న వస్తువులను కూడా సూపర్ క్లారిటీతో క్యాప్చర్ చేయొచ్చు. ఇక హై-ఎండ్ మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్‌లలో 12GB RAM, A19 ప్రో చిప్ ఉండబోతున్నాయి. ఈ చిప్ వల్ల ఫోన్ స్పీడ్, పెర్ఫార్మెన్స్ మరింత స్మూత్‌గా ఉంటాయి.

ఈ సారి ఆపిల్ టైటానియం ఫ్రేమ్‌కి బదులు అల్యూమినియం ఫ్రేమ్‌ని ఉపయోగించబోతోందట. దీనివల్ల ఫోన్ బరువు తగ్గడమే కాకుండా, ధర కూడా కాస్త తక్కువగా కావచ్చు. జూమ్ కెపాబిలిటీస్ కూడా మెరుగుపడనున్నాయి. సో ఫొటోగ్రఫీ లవర్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్ కాబోతోంది.


ఇవి కూడా చదవండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 12:52 PM