Share News

AI in Tech: కోడ్ నుంచి కరెక్షన్ వరకు.. టెక్ రంగాన్ని మార్చేస్తున్న ఏఐ

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:42 PM

కృత్రిమ మేధస్సు (AI) టెక్ ప్రపంచాన్ని వేగంగా ఆక్రమిస్తోంది. గూగుల్ DORA విభాగం తాజా అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5,000 మంది టెక్ నిపుణుల్లో దాదాపు 90% మంది తమ రోజువారీ పనుల్లో ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు. ఇంకా దీని గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

AI in Tech: కోడ్ నుంచి కరెక్షన్ వరకు.. టెక్ రంగాన్ని మార్చేస్తున్న ఏఐ
AI in tech Google DORA

టెక్ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. ప్రతి రోజు టెక్ నిపుణులు AI టూల్స్‌ను తమ పనిలో భాగంగా మార్చుకుంటున్నారు. గూగుల్ DORA నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5,000 మంది టెక్ నిపుణుల్లో 90% మంది AI వినియోగిస్తున్నట్లు తేలింది.

ఇది గత ఏడాదితో పోలిస్తే 14% అధికం కావడం విశేషం. ముఖ్యంగా కోడింగ్, బగ్ ఫిక్సింగ్ వంటి అనేక పనుల్లో కూడా AI కీలక భాగస్వామిగా మారింది. టెక్ ప్రపంచంలో ఈ మార్పు కేవలం ప్రారంభం మాత్రమే కాదు. వచ్చే రోజుల్లో AI వినియోగం మరింత విస్తరించబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఉద్యోగాలపై ప్రభావం

ఏఐ ఆవిష్కరణ టెక్ రంగంలో ఉద్యోగాలపై ఆందోళనలు, అంచనాలను రేకెత్తిస్తోందని ఆంథ్రోపిక్ CEO డారియో అమోడీ అన్నారు. రానున్న రోజుల్లో AI వల్ల నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలు పొందడం కష్టతరంగా మారుతోందని, టెక్ రంగంలో ఉద్యోగ కోతలు కూడా జరుగుతున్నాయని డేటా సూచిస్తోంది.

న్యూయార్క్ ఫెడ్ డేటా ప్రకారం కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు నిరుద్యోగ రేటు.. ఆర్ట్ హిస్టరీ, ఇంగ్లీష్ వంటి రంగాల కంటే ఎక్కువగా ఉంది. ఇండీడ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగ ప్రకటనలు 2022 ఫిబ్రవరి నుంచి 2025 ఆగస్టు వరకు 71% తగ్గాయి.


గూగుల్లో AI టూల్స్ వినియోగం

గూగుల్, ఏఐ సహాయక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించే సంస్థలలో ఒకటి. ఇది ఉచిత టూల్స్ నుంచి నెలకు $45 వరకు ధర ఉన్న కోడ్ జనరేషన్, డెవలప్‌మెంట్ ఏజెంట్‌లను అందిస్తోంది. గూగుల్‌లోని జెమినీ కోడ్ అసిస్ట్ వంటి టూల్స్‌ను నిర్వహించే ర్యాన్ J.సాల్వా.. గూగుల్‌లోని దాదాపు అన్ని టీమ్‌లు AIని ఉపయోగిస్తున్నాయని పేర్కొంది. డాక్యుమెంటేషన్ రాయడం నుంచి కోడ్ ఎడిటర్‌ల వరకు AI పూర్తిగా అనుసంధానం అయ్యిందని ఆయన అన్నారు. గూగుల్లో ఇంజనీర్‌గా ఉంటే, AIని ఉపయోగించకుండా ఉండటం అసాధ్యమని ఆయన ఓ మీడియాతో తెలిపారు.


AI కోడ్‌పై నమ్మకం

కానీ AIని ఉపయోగించే ప్రతి ఒక్కరూ దాని నాణ్యతపై పూర్తి నమ్మకంగా లేరు. సర్వేలో పాల్గొన్న 46% మంది టెక్ నిపుణులు AI జనరేట్ చేసిన కోడ్ నాణ్యతపై కొంత నమ్మకం ఉందని, 23% మంది స్వల్పంగా నమ్మకం ఉందని, 20% మంది చాలా నమ్మకం ఉందని మాత్రమే చెప్పారు. 31% మంది AI వల్ల కోడ్ నాణ్యత స్వల్పంగా మెరుగైందని, 30% మంది ఎలాంటి ప్రభావం లేదని తెలిపారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2025 | 12:46 PM