Germany Invite: భారతీయులకు షాకిచ్చిన అమెరికా..ఆహ్వానం పలికిన జర్మనీ
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:24 PM
అమెరికా ఇటీవల H-1B వీసాలో మార్పులు లక్షలాది భారతీయ హై-స్కిల్ వర్కర్లకు ఎదురుదెబ్బలా మారాయి. ఇదే సమయంలో భారతీయ టాలెంట్‌ను ఆహ్వానిస్తూ యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల జర్మనీ ముందుకొచ్చింది.
అమెరికా ఇటీవల తీసుకున్న వలస విధాన మార్పులు భారతీయులకు పెద్ద దెబ్బగా మారాయి. ప్రత్యేకంగా హై-స్కిల్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే H-1B వీసా ఫీజులను అమెరికా ప్రభుత్వం (America Government) భారీగా పెంచింది. ప్రస్తుతం ఒక్కో అప్లికేషన్‌కు రూ. 83 లక్షల వరకు (అంటే $100,000) వసూలు చేస్తామని ప్రకటించారు. దీని వల్ల లక్షలాది మంది భారత టెకీలు, ఐటీ కంపెనీలు షాక్‌కు గురయ్యాయి.
ఇదే సమయంలో యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల జర్మనీ, భారతీయ టాలెంట్‌కు స్వాగతం (Germany Invite) పలుకుతోంది. జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. భారతీయులారా… మీరు హై స్కిల్ వర్కర్స్ అయితే, జర్మనీకి స్వాగతం. మాకు మీరు కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు.
జర్మనీలో భారతీయులకు విశేష అవకాశాలు
అంబాసిడర్ అకెర్మన్ ప్రకారం ఐటీ, మేనేజ్మెంట్, సైన్స్, టెక్నాలజీ వంటి విభాగాల్లో భారతీయులకు వేలాది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు జర్మనీలో పనిచేస్తున్న సగటు భారతీయుడు స్థానికుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు.
జర్మనీ vs అమెరికా వీసా ప్రాసెస్
అమెరికా: స్లాట్లలో పెరుగుదల లేదు, పరిశీలన కఠినం
జర్మనీ: 2025లో 2,00,000 ప్రొఫెషనల్ వీసాలు, వాటిలో 90,000 భారతీయులకు ప్రత్యేకం (మునుపటి నుంచి 20,000 పెంచారు)
జర్మనీ vs అమెరికా వీసా పాలసీ విధానం
అమెరికా: తరచూ నియమాల మార్పులు, విమర్శకులు దీన్ని వివక్షాత్మకంగా పేర్కొంటున్నారు
జర్మనీ: జర్మన్ నమ్మదగినదని రాయబార్ ఫిలిప్ ఆకర్మన్ అన్నారు
జర్మనీ vs అమెరికా వీసా ఫీజులు
అమెరికా: H-1B వీసా ఫీజు $100,000 (సుమారు రూ. 89 లక్షలు)కి పెరిగింది (మునుపటి $215–$5,000 నుంచి).
జర్మనీ: ఆకస్మిక పెంపలు లేవు, స్థిరమైన నియమాలు, తక్కువ ఖర్చు (€75 లేదా సుమారు రూ. 8,000 పెద్దలకు)
జర్మనీకి కార్మికుల అవసరం
నిపుణుల అంచనా ప్రకారం జర్మనీలో వృద్ధాప్య జనాభాను సమతుల్యం చేయడానికి 2040 వరకు సంవత్సరానికి దాదాపు 2,88,000 ఇమ్మిగ్రెంట్లు అవసరం. ఈ డిమాండ్‌ను తీర్చడానికి, బెర్లిన్ ప్రొఫెషనల్ వీసా కేటాయింపులను విస్తరించింది. 2024లో భారతీయ కార్మికులకు అత్యధిక వాటా ఇచ్చి 10% కంటే ఎక్కువ పర్మిట్లు జారీ చేయాలని ప్లాన్ చేస్తోంది.
గత సంవత్సరం జర్మన్ ప్రభుత్వం 2025లో 2,00,000 ప్రొఫెషనల్ వీసాలు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం, జర్మనీలో దాదాపు 1,30,000 భారతీయ ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారు. 2023 చివరి నాటికి, జర్మన్ పూర్తి సమయ కార్మికుల మధ్యస్థ జీతం నెలకు 3,945 యూరోలు. కానీ భారతీయ మూలాలున్న వారు సగటున 5,359 యూరోలు సంపాదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి