Share News

IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువీ!

ABN , Publish Date - Oct 30 , 2025 | 06:00 PM

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే తమ కోచింగ్ స్టాఫ్‌లో లక్నో యాజమాన్యం పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ఎల్ఎస్‌జీ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే యువీతో చర్చలు జరిపినట్లు సమాచారం.

IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువీ!

ఇంటర్నెట్ డెస్క్: త్వరలోనే ఐపీఎల్ 2026(IPL 2026) సందడి మొదలవ్వనుంది. సీజన్‌కు ముందే తమ కోచింగ్ స్టాఫ్‌లో లక్నో(Lucknow Super Giants) యాజమాన్యం పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే మెంటార్ జహీర్ ఖాన్‌పై వేటు వేసిన లక్నో.. ఇప్పుడు హెడ్ కోచ్ జస్టిస్ లాంగర్‌ను తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆండీ ఫ్లవర్ తర్వాత లక్నో ప్రధాన కోచ్‌గా లాంగర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో ఆయన సరైన బంధం ఏర్పరచుకోలేకపోయారని పలు నివేదికలు వెల్లడించాయి. దీంతో భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్‌కు ఆ బాధ్యతలు(LSG Coach) అప్పగించాలనే ప్రయత్నంలో లక్నో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.


యువీకే ఆ బాధ్యతలు?

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌(Yuvraj Singh)కు ఎల్ఎస్‌జీ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే యువీతో చర్చలు జరిపినట్లు సమాచారం. యువీ ఇప్పటి వరకు ఏ ప్రొఫెషనల్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయలేదు. కానీ అబుదాబి టీ10 లీగ్‌లో మాత్రం మెంటార్‌గా వ్యవహరించాడు. అయితే పంజాబ్‌కు చెందిన ఎంతో మంది యువ ఆటగాళ్లను మాత్రం తన అనుభవంతో యువీ తీర్చిదిద్దాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాన్ష్ ఆర్య వంటి ప్లేయర్లు యువీ శిష్యులే.


కాగా లక్నో ఫ్రాంచైజీ ఇటీవలే పలు నూతన నియమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను వ్యూహాత్మక సలహాదారుగా, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కార్ల్ క్రోవ్ లక్నో జట్టులో చేరారు. కాగా గత సీజన్‌లో పంత్ సారథ్యంలో లక్నో జట్టు ప్లే ఆఫ్స్ కూడా చేరుకోలేకపోయింది. ఈ భారీ మార్పులతో ఈసారి అయినా లక్నో విజయం సాధిస్తుందా? చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు

Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి

Updated Date - Oct 30 , 2025 | 06:00 PM