Jaiswal slams forehead: తల కొట్టుకున్న జైస్వాల్.. ఎలా రనౌట్ అయ్యాడో చూడండి..
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:36 PM
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మైదానంలో తీవ్ర అసహనం ప్రదర్శించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీకి చేరువ అవుతున్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో రనౌట్ కావడం జైస్వాల్‌ను నిరాశలోకి నెట్టింది.
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మైదానంలో తీవ్ర అసహనం ప్రదర్శించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీకి చేరువ అవుతున్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో రనౌట్ కావడం జైస్వాల్‌ను నిరాశలోకి నెట్టింది. దీంతో మైదానంలో తల కొట్టుకుని నెమ్మదిగా పెవిలియన్‌కు చేరాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Yashasvi Jaiswal run out).
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చేసిన చిన్న తప్పిదం కారణంగానే జైశ్వాల్ 175 పరుగుల వద్ద రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. మంచి జోష్‌లో కనిపించిన జైస్వాల్ డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. ఇన్నింగ్స్ 92వ ఓవర్ రెండో బంతిని యశస్వి మిడాఫ్ వైపు కొట్టాడు. రన్ కోసం ముందుకు కదిలాడు. నాన్ స్ట్రైకర్ అయిన గిల్ కూడా ముందుకు వచ్చాడు. ఆ వెంటనే పరుగు వద్దంటూ గిల్ వెనక్కి వెళ్లాడు. అప్పటికే సగం పిచ్‌కు పైగా జైశ్వాల్ వచ్చేశాడు (Jaiswal run out video).
తిరిగి క్రీజులోకి చేరుకునే లోపు కీపర్ వికెట్లను గిరాటేశాడు. దీంతో శుభ్‌మన్ గిల్(Shubman Gill)పై యశస్వి తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు (Jaiswal emotional reaction). డబుల్ సెంచరీ మిస్ కావడంతో జైస్వాల్ తీవ్ర అసహనంతో తలను చేతితో కొట్టుకుంటూ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి:
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
IPL 2026: CSK రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి