Women's World Cup2025: 8 ఏళ్ల హిస్టరీ.. భారత్ రిపీట్ చేసేనా?
ABN , Publish Date - Oct 30 , 2025 | 09:13 AM
క్రికెట్ అంటే ఆస్ట్రేలియా ఆధిపత్యం ఎక్కువ గా కనిపిస్తుంది. ఇక ఐసీసీ టోర్నీల్లో అయితే ఆ జట్టు చెలరేగిపోతుంది. పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అంటే పూనకం వస్తుంది. వాళ్లను ఆపడం అంత ఈజీగా కాదు. మహిళా ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఆసీస్ కు రికార్డు ఉంది.
క్రీడా వార్తలు: మహిళల ప్రపంచ కప్ 2025 చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో టోర్నీ ముగియనుంది. సెకండ్ సెమీ-ఫైనల్ నేడు(అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య ముంబైలో జరగనుంది. డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్.. ఈ మ్యాచ్ లో చాలా కష్టపడాల్సి ఉంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోక పోవడమే హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు అతిపెద్ద సవాలు. కాబట్టి, ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్(Second Semi-Final) అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో 8 ఏళ్ల క్రితం జరిగిన హిస్టరీని భారత్ మరోసారి రిపీట్ చేస్తుందా అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో నెలకున్నాయి. మరి.. హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ ఆటలో ఆస్ట్రేలియా(Australia) ఆధిపత్యం ఎక్కువ గా కనిపిస్తుంది. ఇక ఐసీసీ టోర్నీల్లో అయితే ఆ జట్టు చెలరేగిపోతుంది. పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అంటే పూనకం వస్తుంది. వాళ్లను ఆపడం అంత ఈజీగా కాదు. మహిళా ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఆసీస్ కు రికార్డు ఉంది. ఈసారి కూడా బలమైన పోటీదారుగా గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నారు. గత ఎనిమిదేళ్లలో ఆస్ట్రేలియా ఒక్క ప్రపంచ కప్ మ్యాచ్‌ను కూడా కోల్పోలేదు. అయితే, మహిళల ప్రపంచ కప్‌లో ఎవరైనా ఆస్ట్రేలియాను ఓడించగలిగితే అది భారత్( INDIA) మాత్రమే. ఎనిమిదేళ్ల (2017 Women’s World Cup)క్రితం ఆసీస్ కు భారత్ ఊహించని షాకిచ్చింది.
8 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..
2017 మహిళల ప్రపంచ కప్(2017 Women’s World Cup)లో ఆస్ట్రేలియాకు భారత్ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ ఎడిషన్ సెమీఫైనల్లో రెండు జట్లు తలపడ్డాయి. టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించడంతో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) 171 పరుగులతో అజేయంగా నిలిచింది . ఆస్ట్రేలియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా ఆ టోర్నీలో ఆస్ట్రేలియాకు వరల్ట్ కప్ ను దూరం చేసింది. ఎనిమిదేళ్ల భారత్ అదే హిస్టరీని రిపీట్ చేస్తుందని క్రికెట్ అభిమానులు ఆశగా ఉన్నారు.
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్