Rinku Singh Love Story: రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:39 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవల తన ప్రియురాలు, రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌తో రింకూ నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా వీరి ప్రేమకు సంబంధించిన సీక్రెట్‌ను రింకూ సింగ్ చెల్లెలు నేహా సింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది.
ముంబై, అక్టోబర్ 29: టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవల తన ప్రియురాలు, రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్(Priya Saroj)తో రింకూ నిశ్చితార్థం (Rinku Singh Engagement)చేసుకున్నాడు. అయితే ఒకరు క్రికెట్‌లో మరొకరు రాజకీయాల్లో ఉన్న ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? వారి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? అనే ఆసక్తి అందరిలో ఉంది. కాగా వీరి ప్రేమకు సంబంధించిన సీక్రెట్ రింకూ సింగ్ చెల్లెలు నేహా సింగ్(Neha Singh) ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది.
‘రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల బంధం ఏర్పడటానికి ప్రధాన కారణం బట్టల వ్యాపారం. ఇన్‌స్టా ద్వారా వీరి మధ్య పరిచయం మొదలైంది. మా వదిన ప్రియా అలీగఢ్‌లో ఉంటుంది. ఆమెకు అక్కడ బట్టల వ్యాపారం ఉంది. తమ వ్యాపారం గురించి రింకూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయాలని కోరింది. ఇలా ఆ వ్యాపారం గురించి వీరి మధ్య మెసేజ్‌లు మొదలయ్యాయి. ప్రియాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. రింకూ సింగ్ గురించి ముందే నుంచే తనకు తెలుసు. పరిచయం కాకముందే నుంచే అతడిపై ప్రియాకు అభిమానం ఉంది. అలా ఆ అభిమానం కాస్తా ప్రేమ, నిశ్చితార్థం వరకు వచ్చాయి. నాకు, మా వదిన ప్రియాకు మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. తను ఎంత బిజీలో ఉన్నా.. నేను ఫోన్ చేస్తే కచ్చితంగా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది’ అని నేహా సింగ్ వెల్లడించింది.
Also Read:
జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా ఉపశమనం పొందండి.!
టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌లకు నితీశ్ దూరం!