Suryakumar Yadav: సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్
ABN , Publish Date - Oct 29 , 2025 | 02:55 PM
చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చిన దాఖలాలే లేవు. ఆసియా కప్‌లో ఓ రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించినా.. అతడి ఆటతీరు మాత్రం అది కాదు. ఈ క్రమంలో సూర్య ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.
కాన్‌బెర్రా, అక్టోబర్ 29: భారత్-ఆస్ట్రేలియా మధ్య నేటి(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్(India vs Australia T20) బుధవారం కాన్‌బెర్రా వేదికగా జరగుతోంది. అయితే ఈ సిరీస్‌లో అందరి కళ్లూ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) పైనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్య.. ఈ సిరీస్‌లోనైనా పుంజుకుంటాడా? అని అభిమానులు అనుకుంటున్నారు. చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చిన దాఖలాలే లేవు. ఆసియా కప్‌లో ఓ రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించినా.. అతడి ఆటతీరు మాత్రం అది కాదు. ఈ క్రమంలో సూర్య ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్(Abhishek Nayar) స్పందించాడు.
‘ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్(T20 Series) మరింత ఆసక్తికరంగా మారబోతోంది. కొన్నిసార్లు జట్టు విజయాలు వ్యక్తిగత ప్రదర్శనలను కప్పేస్తాయి. ఫలితాల్లో వ్యత్యాసం వచ్చినప్పుడే ఆటగాళ్ల ఫామ్‌పై ప్రశ్నలు వస్తాయి. టీ20ల్లో చాలా కాలం పాటు వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న భారత కెప్టెన్ సూర్య కుమార్ నుంచి మెరుగైన ప్రదర్శన రాలేదు. తప్పకుండా అతడి ఆటతీరుపై జట్టులో చర్చ జరిగి ఉంటుందని అనుకుంటున్నా. అతడి సత్తా ఏంటో మనకు తెలుసు. ఆసీస్ పిచ్ కండీషన్, బౌన్స్ తప్పకుండా సూర్యకుమార్ బ్యాటింగ్ స్ట్రైల్‌కు నప్పుతాయి. మొన్నటివరకు అతడి పేలవ ప్రదర్శన తాలూకా ప్రభావం ఇకపై ఏమాత్రం ఉండదని అనుకుంటున్నా. గత ఐపీఎల్‌లో 700కి పైగా పరుగులు సాధించి మంచి ఆటతీరు ప్రదర్శించాడనే విషయం మర్చిపోకూడదు’ అని అభిషేక్ నాయర్ వ్యాఖ్యానించాడు.
బ్యాట్ మౌనం వీడనుందా..?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ ఏడాది ఇప్పటి వరకు 12 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. గత ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై చేసిన 47 పరుగులే అత్యధికం. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని చెప్పే సూర్య నుంచి సరైన ఇన్నింగ్స్ లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శుభ్‌మన్ గిల్(Gill) రూపంలో సూర్య కెప్టెన్సీకే ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఆసీస్‌తో జరిగే సిరీస్‌లో సూర్య రాణిస్తే వచ్చే ఏడాది ప్రపంచ కప్ వరకు సూర్య సారథ్యానికి ఢోకా ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. మరి ఈ సిరీస్‌లో అయినా సూర్య బ్యాట్ మౌనం వీడుతుందా? అనే చూడాలి.
Also Read:
Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా
IND vs AUS : టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే