Mixed Cricket: ఒకే జట్టులో కోహ్లీ, స్మృతి మంధాన.. ?
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:34 PM
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విశ్వ విజేతగా భారత జట్టు అవతరించడంతో మగువల క్రికెట్‌కు దేశంలో ఆదరణ అమాంతం పెరిగింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించడంతో మహిళల క్రికెట్ బ్రాండ్ అట్టడుగు నుంచి టాప్ లోకి ఎగబాకింది. ఈ క్రమంలో మహిళలు, పురుషుల క్రికెటర్లు కలిసి ఆడితే సూపర్ గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
క్రీడా వార్తలు: మహిళల వన్డే ప్రపంచకప్ 2025( Women world cup) విశ్వ విజేతగా భారత జట్టు అవతరించడంతో మగువల క్రికెట్‌కు దేశంలో ఆదరణ అమాంతం పెరిగింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించడంతో మహిళల క్రికెట్ బ్రాండ్ అట్టడుగు నుంచి టాప్ లోకి ఎగబాకింది. గత రెండు రోజుల నుంచి యావత్ భారత దేశం సంబరాల్లో మునిగి తేలుతుంది. ఇదే సమయంలో ఓ భిన్నమైన ఆలోచన తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు మెన్, ఉమెన్ విడివిడిగా క్రికెట్ ఆడుతున్నారు. అయితే ఇకపై మిక్స్ డ్ క్రికెట్(Mixed Cricket) ఆడితే బాగుంటుందనే అంశం తెరపైకి వచ్చింది. సమీప భవిష్యత్తులో టెన్నిస్, బ్యాడ్మింటన్ తరహాలోనే క్రికెట్‌లో కూడా మిక్స్‌డ్ టోర్నీలు జరిగే అవకాశం ఉందని టాక్.
మహిళలు, పురుషుల క్రికెటర్లు కలిసి ఆడితే సూపర్ గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మతో కలిసి స్మృతి మంధాన(Smriti Mandhana, ), హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ బ్యాటింగ్ చేసే ఊహనే చాలా ఆసక్తిగా ఉందని మిక్స్‌డ్ టోర్నీ నిర్వహిస్తే ఆటకు మరింత ప్రాచుర్యం పెరుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 50 ఓవర్ల మ్యాచ్ కాకపోయినా కనీసం టీ20 ఫార్మాట్‌లోనైనా ఇలా మిక్స్ డ్ క్రికెట్ ఆడించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. క్రికెట్ లో మిక్స్‌డ్ ఈవెంట్ కుదరదని, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో స్మృతి మంధాన బ్యాటింగ్ చేయగలదా? ఆ వేగాన్ని తట్టుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
మహిళల క్రికెట్(women cricket) ఎంత ఎదిగినా.. పురుషుల క్రికెట్ స్థాయిలో రాణించలేరని, ఇరువురి సామార్థ్యాల్లో కచ్చితంగా తేడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మహిళలు శక్తి స్వరూపులని, వారు సాధించలేనిది అంటూ ఏదీ లేదని, భవిష్యత్తులో మెన్ క్రికెటర్లకు ధీటుగా ఆడుతారని మరికొందరు ధీటుగా బదులిస్తున్నారు. క్రికెట్ అందరి ఆట అని, పురుషుల ఒక్కరి సొత్తే కాదని కూడా కామెంట్ చేస్తున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్(women cricket world cup)లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్.. పురుషుల క్రికెట్ కంటే మెరుగ్గా ఉందని గుర్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News