Share News

India vs Australia: టెన్షన్‌లో రోహిత్, కోహ్లీ అభిమానులు..ఎందుకంటే!

ABN , Publish Date - Oct 18 , 2025 | 03:38 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ముూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఆదివారం(అక్టోబర్ 19) పెర్త్‌లోని స్టేడియంలో జరుగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్‌తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వస్తుండటంతో ఈ సిరీస్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

India vs Australia:  టెన్షన్‌లో రోహిత్, కోహ్లీ అభిమానులు..ఎందుకంటే!
India vs Australia

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ముూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఆదివారం(అక్టోబర్ 19) పెర్త్‌లోని స్టేడియంలో జరుగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్‌తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వస్తుండటంతో ఈ సిరీస్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అంతేకాక కోహ్లీ అరుదైన రికార్డు కోసం అతడి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్..విధ్వంసకరమైన బ్యాటింగ్ ను చూసేందుకు ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో వారిని ఓ వార్త టెన్షన్ కు గురి చేస్తుంది.


భారత్, ఆసీస్ (India vs Australia)మధ్య తొలి మ్యాచ్ ఆదివారం నాడు(అక్టోబర్ 19) పెర్త్‌లో జరగనుండగా..మ్యాచ్‌కు సరిగ్గా ఒక రోజు ముందు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు ఓ సమాచారం ఇచ్చాయి. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండనుందని నివేదిక తెలిపింది. ఈ వార్త క్రికెట్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. వర్షం( Full weather forecast) కారణంగా మ్యాచ్ రద్దయ్యే లేదా ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక సుధీర్ఘ విరామం తర్వాత రోహిత్, కోహ్లీ ఆటను చూడాలని భావించిన వారి అభిమానులకు వెదర్ రిపోర్ట్ టెన్షన్ పెడుతుంది.


ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. పెర్త్‌లో ఆదివారం జరగబోయే తొలి వన్డే మ్యాచ్‌పై వాతావరణ ప్రభావం(Full weather forecast) ఉండే అవకాశం ఉందట. తొలి వన్డే జరిగే రోజు పెర్త్‌లో 63 శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మ్యాచ్ జరిగే సమయంలో 36 శాతం వర్షం పడొచ్చని వెదర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా మ్యాచ్‌లో పలుమార్లు అంతరాయాలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. దీంతో బ్యాటర్లకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

పీసీబీ చీఫ్ కుతంత్రాలు.. ఇప్పటికీ టీమిండియా చేతికి దక్కని ఆసియా కప్ ట్రోఫీ

Rashiid Khan: పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ నిప్పులు

మరిన్ని క్రీడాతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 18 , 2025 | 05:30 PM