Share News

Virat Kohli: ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ!

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:31 PM

బుధవారం నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడనున్నాయి. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ మరో పరుగు చేస్తే ఓ కీలక మైలురాయిని అందుకుంటాడు.

Virat Kohli: ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ!
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ టోర్నీలో ఆడుతున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి జరిగే విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.


చరిత్రకు ‘పరుగు’ దూరంలో..

అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో కోహ్లీ(Virat Kohli) 14,557 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఓవరాల్‌గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రతో బుధవారం జరిగే మ్యాచ్‌లో మరో పరుగు చేస్తే.. లిస్ట్-ఏ క్రికెట్‌లో 16వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. దీని ద్వారా ఈ ఫీట్ అందుకున్న భారత రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో సచిన్ 21,999 పరుగులు సాధించాడు. కాగా వన్డేలతో పాటు విజయ్‌ హజారే ట్రోఫీ, భారత్‌-ఎ, జోనల్‌ జట్ల తరఫున సాధించిన పరుగులను లిస్ట్‌-ఎ జాబితాలో చేర్చుతారు. కాగా ఓవరాల్‌గా ఈ లిస్టులో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ గ్రాహమ్‌ గూచ్‌ 22,211 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.


లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు

  • సచిన్‌ టెండూల్కర్‌- 538 ఇన్నింగ్స్‌లో 21,999 రన్స్‌

  • విరాట్‌ కోహ్లి- 329 ఇన్నింగ్స్‌లో 15,999 రన్స్‌

  • సౌరవ్‌ గంగూలీ- 421 ఇన్నింగ్స్‌లో 15,622 రన్స్‌

  • రోహిత్‌ శర్మ- 338 ఇన్నింగ్స్‌లో 13,758 రన్స్‌

  • శిఖర్‌ ధావన్‌- 298 ఇన్నింగ్స్‌లో 12,074 రన్స్‌


ఇవీ చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Updated Date - Dec 23 , 2025 | 05:31 PM