Arshdeep Singh: పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:03 PM
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచాక కోహ్లీ-అర్ష్‌దీప్ సింగ్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీసుకుని సఫారీల ఓటమిని శాసించారు. ఇటు బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(116*), విరాట్ కోహ్లీ(65*), రోహిత్ శర్మ(75) అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్ ఆసాంతం కోహ్లీ ఫన్, జోష్ అందరిని ఆకట్టుకుంది. ఈ సారి విరాట్ ట్రోలింగ్‌కు పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) బలైయ్యాడు.
అసలేమైందంటే..?
ఈ సిరీస్‌లో కోహ్లీ(Virat Kohli) వరుసగా రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. 271 పరుగుల లక్ష్యాన్ని యశస్వి, రోహిత్ 155 పరుగుల భాగస్వామ్యంతో సగం పనిని పూర్తి చేశారు. రోహిత్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కానీ కోహ్లీ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లక్ష్యాన్ని ఛేదించడంతో హ్యాట్రిక్ సెంచరీ మిస్ అయింది. మ్యాచ్ గెలిచిన తర్వాత అర్ష్‌దీప్ సరదాగా మొబైల్‌లో వీడియో తీస్తూ కోహ్లీని ప్రశ్నించాడు. ‘పాజీ.. రన్స్ తక్కువయ్యాయ్. కానీ లేకపోతే సెంచరీ పక్కా అయ్యేది. హ్యాట్రిక్ మిస్ అయింది’ అని అన్నాడు.
ఈ ప్రశ్నకు కోహ్లీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అక్కడున్న వారు ఎవరూ విరాట్ నుంచి ఆ సమాధానం వస్తుందని ఊహించనేలేదు. ‘నా సెంచరీ ఏమో కానీ.. టాస్ గెలవకపోతే ఈ డ్యూకి బౌలింగ్‌లో నీకు సెంచరీ పక్కా అయ్యేది’ అని సరదాగా అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా నవ్వారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా గత రెండు మ్యాచుల్లో టీమిండియా టాస్ ఓడటంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కి దిగిన విషయం తెలిసిందే. డ్యూ ఎక్కువ రావడం వల్ల టీమిండియా బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఇద్దరూ సెంచరీలు చేసి భారీ స్కోరు అందించినా.. బాలర్ల వల్ల మ్యాచ్ ఓడిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!