Share News

Virat Kohli: కుల్దీప్ యాదవ్‌పై విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్

ABN , Publish Date - Dec 08 , 2025 | 07:20 PM

సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత భారత్ ప్లేయర్లు సరదగా గడిపారు. డ్రెస్సింగ్ రూమ్ లో సెటైర్లు వేసుకుంటూ సందడి చేశారు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ కోహ్లీ.. స్పిన్నర్ కుల్దీప్ పై ఫన్నీ కామెంట్స్ చేశాడు.

Virat Kohli: కుల్దీప్ యాదవ్‌పై విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1(India vs South Africa) తేడాతో కైవసం చేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లేకపోయినా కెఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు మంచి ప్రదర్శన ఇచ్చింది. విరాట్ కోహ్లీ మూడు ఇన్నింగ్స్‌లలో 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. సిరీస్‌ను నిర్ణయించే మూడవ వన్డేలోనూ కోహ్లీ 65 నాటౌట్‌గా నిలిచాడు. ఈ సిరీస్ లో బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొమ్మిది వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బౌలింగ్ సహాయక కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(Yadav impact player) అవార్డును కుల్దీప్ యాదవ్ కు అందజేశాడు. ఈ క్రమంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో సందడి వాతావరణం నెలకొంది. విరాట్ కోహ్లీ(Virat Kohli).. కుల్దీప్ పై ఫన్నీ కామెంట్స్ చేశాడు.


ఈ అవార్డును ప్రధానం చేసే క్రమంలో కోచ్ డోషేట్..కుల్దీప్(Yadav impact player) పై ప్రశంసల వర్షం కురిపించాడు. అనంతరం అతడికి ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందజేశాడు. ఆ తర్వాత కుల్దీప్ ను ప్రసంగించమని ఆయన కోరారు. కానీ అతను ఏమి మాట్లాడకుండా ఆ టాస్క్ నుంచి బయటపడ్డాడు. అయితే సహచర ప్లేయర్లు కుల్దీప్‌పై ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఇదే సమయంలో కుల్దీప్ ను ఉద్దేశిస్తూ... 'రో డి, రో డి (ఏడుపు, ఏడ్చు)' అంటూ కోహ్లీ ఫన్నీ కామెంట్స్(funny moments) చేశాడు. ఇక కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ.. 'నా వైపు నుండి చెప్పడానికి ఏమీ లేదు. కానీ విరాట్ భాయ్, జైసు (యశస్వి జైస్వాల్) లకు అభినందనలు. జైస్వాల్ చివరి వన్డేలో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడు. దీన్ని అందరం ఎంజాయ్ చేద్దాం' అని చెప్పుకొచ్చాడు. నిర్ణాయత్మకమైన చివరి వన్డేలో జైస్వాల్ సూపర్ సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక విరాట్, కుల్దీప్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఈ వార్తలు కూడా చదవండి..

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!

Updated Date - Dec 08 , 2025 | 07:36 PM