Mohan Bhagwat watches Akhanda 2: అఖండ-2ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఏమన్నారంటే.?
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:04 PM
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 మూవీని వీక్షించారు. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటుచేశారు. సినిమా చూసిన అనంతరం.. ఆయన ఏమన్నారంటే.?
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagavat).. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన అఖండ-2(Akhanda-2) సినిమాను వీక్షించారు. ఇందుకోసం ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం(RSS Office)లో ప్రత్యేక షో ఏర్పాటుచేశారు నిర్వాహకులు. మోహన్ భగవత్‌తో పాటు అఖండ-2 డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఆ చిత్ర నిర్మాతలు కూడా ఈ సినిమాను చూశారు.
సినిమా వీక్షణ అనంతరం.. అఖండ-2 మూవీపై ప్రశంసలు కురిపించారు ఆర్ఎస్ఎస్ చీఫ్(RSS Chief). సినిమా చాలా బావుందని చెప్పిన ఆయన.. అందులో కథానాయకులు అద్భుతంగా నటించారని కితాబిచ్చారు.
బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వం వహించిన అఖండ-2.. తొలుత సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడి డిసెంబర్ 5కు వాయిదా పడింది. కానీ, విడుదలకు ముందు కొన్ని సమస్యలు తలెత్తడంతో మరోసారి అర్ధంతరంగా పోస్ట్‌పోన్ అయింది. అయితే.. ఈ సినిమాను ఈనెల 25న రిలీజ్‌కు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ మూవీ కోసం ఇప్పటికే థియేటర్ల వద్ద కట్టిన బ్యానర్లను, కటౌట్స్‌ను తీయొద్దని థియేటర్ యాజమాన్యాలకు మూవీ టీమ్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: