Vijay Hazare Trophy: సర్ఫరాజ్ ఖాన్ భారీ శతకం.. గోవా టార్గెట్ 445
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:25 PM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా ముంబయి, గోవా జట్లు తలపడుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్(157) భారీ శతకాన్ని నమోదు చేశాడు. 75 బంతుల్లో ఏకంగా 9 ఫోర్లు, 14 సిక్సులు బాదాడు. నిర్ణీత 50 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి గోవా జట్టుకు 445 పరుగలు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా ముంబయి, గోవా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గోవా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. సర్ఫరాజ్ ఖాన్(157) భారీ శతకాన్ని నమోదు చేశాడు. 75 బంతుల్లో ఏకంగా 9 ఫోర్లు, 14 సిక్సులు బాదాడు. నిర్ణీత 50 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి గోవా జట్టుకు 445 పరుగలు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(46) హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్(60), వికెట్ కీపర్ హార్దిక్ టమోర్(53) అర్థ శతకాలతో ఆకట్టుకున్నారు. అంగ్క్రిష్ రఘువంశీ (11), సిద్దేశ్ లాడ్ (17), కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్ (27), ములానీ(22) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. , తనుష్(23), తుషార్ దేశ్‌పాండే(7) నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ ఆది నుంచి చెలరేగి ఆడాడు. సర్ఫరాజ్ భారీ శతకంతోనే ముంబై ఈ భారీ స్కోరును సాధించిందనడంలో సందేహం లేదు.
గోవా బౌలర్లు పూర్తిగా తడబడ్డారు. దర్శన్ మిసాల్ 3, లలిత్ యాదవ్, వాసుకి కౌశిక్ తలో రెండు, దీప్రాజ్ ఒక వికెట్ తీసుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమయ్యాడు. 8 ఓవర్లు వేసిన అర్జున్.. 78 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీసకోలేకపోయాడు.
ఇవీ చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?
కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!