U19 Asia Cup: వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:59 PM
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈ, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. 55 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అద్భుత ప్రదర్శనలతో రికార్డులను కొల్లగొడుతున్నాడు. సెలక్టర్ల దృష్టిలో పడిన వైభవ్.. అండర్ 19 ఆసియా కప్ 2025లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో భాగంగా యూఏఈ, టీమిండియా మధ్య దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) సూపర్ సెంచరీ చేశాడు. 55 బంతుల్లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. మరో ఎండ్‌లో అరోన్ జార్జి హాఫ్ సెంచరీ చేశాడు. 32 ఓవర్లు పూర్తి అయ్యే సరికి వైభవ్ 95 బంతుల్లో 171 పరుగులు (9 ఫోర్లు, 14 సిక్స్‌లు), అరోన్ జార్జి 73 బంతుల్లో 69 పరుగులు (7ఫోర్లు 1 సిక్స్) చెలరేగి ఆడారు. వీరు రెండో వికెట్‌కు 139 బంతుల్లోనే 212 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం జట్టు స్కోర్ 265/3గా ఉంది. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే మాత్రం (4) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. కాగా క్రీజులో విహాన్ మల్హోత్ర(13), వేదాంత్ త్రివేది(0) క్రీజులో ఉన్నారు.
ఇవీ చదవండి:
పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?
ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!