Share News

U19 Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్.. కొనసాగుతున్న ‘నో షేక్ హ్యాండ్’!

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:34 PM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని యువ భారత్ అండర్ 19 ఆసియా కప్‌లో కొనసాగించింది.

U19 Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్.. కొనసాగుతున్న ‘నో షేక్ హ్యాండ్’!
U19 Asia Cup 2025

ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచులోనూ(U19 Asia Cup 2025) ‘నో హ్యాండ్ షేక్’ ఘటన పునరావృతం అయింది.


పహల్గాం అటాక్ తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రతరమైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపించారు. ట్రోఫీ గెలిచినప్పటికీ.. పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. ఇదే విధానాన్ని యువ భారత్ ఈ అండర్ 19 టోర్నీలోనూ కొనసాగించింది. అయితే భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేసేలా చూడాలని బీసీసీఐను ఐసీసీ అభ్యర్థించినట్లు సమాచారం. కానీ నిర్ణయాన్ని బీసీసీఐకే వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.


మ్యాచ్ విషయానికొస్తే..

తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. 28 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ(5) ఈ మ్యాచ్‌లో తీవ్రంగా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే(38) రాణించాడు. విహాన్ మల్హోత్ర(12), వేదాంత్ త్రివేది(7) నిరాశపర్చారు. క్రీజులో ఆరోన్(75), అభిజ్ఞాన్ కుందు(21) ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. సౌతాఫ్రికా హెడ్ కోచ్

టాస్ గెలిచిన పాకిస్తాన్

Updated Date - Dec 14 , 2025 | 01:34 PM