Mohammad Amir On Tilak: తెలుగు కుర్రాడిపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:52 PM
మ్యాచ్‌లో తిలక్ వర్మ ఆట తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యువ క్రికెటర్ ఆట అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. తాజాగా తిలక్ వర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈనెల 28న (ఆదివారం) పాకిస్థాన్‌తో జరిగిన ఫైన్ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ కుప్పకూలినా తన బ్యాటింగ్ ప్రతిభతో టీం ఇండియా విజయం సాధించేలా చేశాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆ కుర్రాడి పేరే వినిపిస్తోంది. ఈ మ్యాచ్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. భారత్ -పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువ కుర్రాడు 69 పరుగులు తీసి ఇండియా టైటిల్ గెలిచేందుకు కృషి చేశాడు.
మ్యాచ్‌లో తిలక్ వర్మ ఆట తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యువ క్రికెటర్ ఆట అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. తాజాగా తిలక్ వర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ ప్రశంసల వర్షం కురిపించారు. తిలక్ బ్యాటింగ్ అద్భుతమని.. ఎంతో ఒత్తిడిలోనూ జట్టును విజయ తీరాలకు చేర్చాడన్నారు. మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ విఫలమైనప్పటికీ తన ప్రతిభతో పాకిస్థాన్ బౌలర్లతో ధీటుగా పోరాడి టీంఇండియాకు ఆసియా కప్‌ను అందించారని మహ్మద్ అమీర్ కొనియాడారు.
అంతేకాకుండా పాకిస్థాన్ క్రికెట్‌ర్లపై కూడా స్పందించారు మహ్మద్. పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై పలు వ్యాఖ్యలు చేశారు. తిలక్ వర్మను చూసి పాకిస్థాన్ బ్యాటర్లు ఎంతో నేర్చుకోవాలన్నారు. తిలక్ ఎంతో స్మార్ట్‌గా ఆడారని... అనవసర షార్ట్‌లకు పోకుండా సింగిల్స్‌తో రాణిచ్చి తమ జట్టు విజయానికి తోడుగా నిలిచాడన్నారు. మ్యాచుల్లో విజయం సాధించాలంటే ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు ట్రోఫీ ఎలా దక్కుతుంది.. వాళ్లు క్రికెట్‌ను అవమానించారు: పాక్ కెప్టెన్
Read Latest Sports News And Telugu News