Share News

Tilak Varma: అలా కీర్తిస్తుంటే గర్వంగా ఉంది

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:25 AM

ఆసియా టీ20 కప్‌ ఫైనల్లో అజేయ అర్ధ శతకం (69)తో పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మకు...

Tilak Varma: అలా కీర్తిస్తుంటే గర్వంగా ఉంది

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా టీ20 కప్‌ ఫైనల్లో అజేయ అర్ధ శతకం (69)తో పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తిలక్‌కు శాట్‌ చైర్మన్‌ కె.శివసేనా రెడ్డి, వీసీ-ఎండీ సోనీ బాలదేవి స్వాగతం పలికి, సత్కరించారు. ఎయిర్‌పోర్టు బయట తిలక్‌ సోదరుడు తరుణ్‌, కోచ్‌ సలాం బయాష్‌ అభిమానులతో కలిసి స్వాగతం పలికారు.

అలా అంటుంటే..: దేశమంతా తన ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేస్తుంటే ఎంతో గర్వంగా ఉన్నదని తిలక్‌వర్మ అన్నాడు. ‘ఆపరేషన్‌ తిలక్‌’ అంటూ తన ఆటను కీర్తిస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందన్నాడు. ఇక ఫైనల్లో సాధించిన హాఫ్‌ సెంచరీ (69) తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్‌ అని తిలక్‌ అన్నాడు. ‘ఫైనల్లో తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేను బ్యాటింగ్‌ చేసే ముందు గట్టిగా ఊపిరి తీసుకొని, ప్రశాంతంగా ఆడేందుకు ప్రయత్నించా. పాక్‌ పేసర్లు మంచి వేగంతో బౌలింగ్‌ వేస్తున్నారు. బంతి.. బంతికి వైవిధ్యం చూపిస్తూ పరీక్షించారు. అవన్నీ తట్టుకొని సాధించిన ఈ అర్ధ శతకం చిరకాలం గుర్తుంటుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఈ స్థానంలోనైనా ఆడేందుకు జట్టంతా ముందే సన్నద్ధమై ఉంది. మధ్యలో వికెట్‌ నెమ్మదించినపుడు కోచ్‌ గౌతం గంభీర్‌తో మాట్లాడా. ఆయన సలహాలు బాగా ఉపకరించాయి. ఒత్తిడిని అధిగమించి సంజు శాంసన్‌, శివం దూబే ఆడిన తీరు అద్భుతం’ అని తిలక్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి

ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 12:50 PM