BCCI - Mohsin Naqvi: ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
ABN , Publish Date - Sep 29 , 2025 | 08:51 PM
ఆసియా కప్ ట్రోఫీ తీసుకెళ్లిపోయిన మోహసీన్ నఖ్వీ చర్యలపై బీసీసీఐ సెక్రెటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చర్యలు అనైతికమని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ట్రోఫీతో వెళ్లిపోయిన పీసీబీ చీఫ్, పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసీన్ నఖ్వీపై బీసీసీఐ సెక్రెటరీ మండిపడ్డారు. ఆయన చర్యలు అనైతికమని మండిపడ్డారు. ఆసియా కప్ టోర్నీ ఫైనల్స్‌లో భారత్ పాక్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించే నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా జట్టు టోర్నీ కప్ స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా పీసీబీ చీఫ్ నఖ్వీ ఉక్కురోషం పట్టలేక.. టోర్నీ ట్రోఫీని, ఇతర మెడల్స్‌ను తన వెంట తీసుకెళ్లిపోయారు. ట్రోఫీ లేకుండా భారత్ విజయోత్వ వేడుకల్లో పాల్గొనడంతో ఇది వివాదానికి దారి తీసింది. దీనిపై బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా మండిపడ్డారు.
‘అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న పీసీబీ చీఫ్ ఆసియా కప్ ట్రోఫీని తానే విజేతను ఇస్తానని అన్నారు. కానీ ఆయన నుంచి అవార్డు అందుకునే ప్రసక్తే లేదని మేము ముందుగానే చెప్పా. కానీ ఆయన ఇలా చేయడంతో ఆశ్చర్యపోయాము. ఆ ట్రోఫీ, మెడల్స్ భారత్‌కు చెందుతాయి. కాబట్టి, ఆయన వాటిని తన వెంట తీసుకెళతారని అస్సలు ఊహించలేదు. అవి తిరిగిస్తారని ఆశిస్తున్నాము. మాకు తిరిగిచ్చే వరకూ వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారనే అనుకుంటున్నాము’ అని అన్నారు.
‘కానీ మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. మిగతా విషయాలపై కామెంట్ చేసేందుకు ఏమీ లేదు. మా దృష్టి అంతా క్రికెట్‌పైనే. కాబట్టి క్రికెట్‌తో సంబంధం లేని విషయాలపై కామెంట్ చేయదలుచుకోలేదు’ అని అన్నారు.
అవార్డు ప్రదాన కార్యక్రమం గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. కెప్టెన్ సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాక్ జట్టు లేటుగా వేదిక వద్దకు వచ్చింది. అయితే, నఖ్వీతో వేదిక పంచుకునేందుకు భారత్ జట్టు తిరస్కరించడంతో కార్యక్రమం మరింత ఆలస్యమైంది. ఇక నఖ్వీ చర్యలపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. కనీసం విజయోత్సాహంతో కప్‌ను అందుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయిందని అన్నాడు.
ఇవి కూడా చదవండి
Asia Cup Pak Trolled: భారత్‌ను రెచ్చగొట్టి పెద్ద తప్పు చేశారు.. పాక్ టీమ్‌పై అభిమానుల ఆగ్రహం
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి