Asia Cup Pak Trolled: భారత్‌ను రెచ్చగొట్టి పెద్ద తప్పు చేశారు.. పాక్ టీమ్‌పై అభిమానుల ఆగ్రహం
ABN , Publish Date - Sep 29 , 2025 | 05:26 PM
ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్‌పై అభిమానులు మండిపడుతున్నారు. పులితో పెట్టుకుని పాక్ దెబ్బైపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌కు దిగుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రగల్భాలు పలికిన పాక్ జట్టు చివరకు ఆసియా కప్ చేజార్చుకోవడంపై జట్టు అభిమానులు మండిపడుతున్నారు. తమ ఆగ్రహాన్ని నెట్టింట వెళ్లగక్కుతూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. దీంతో, ప్రస్తుతం పాక్ సోషల్ మీడియాలో జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసియా కప్ ఫైనల్స్‌లో పాక్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట్లో వికెట్లు కోల్పోయినా నిలదొక్కుకున్న భారత్ అద్భుత పోరాట పటిమను కనబర్చి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటమితో అభిమానులు నిరాశలో ఉన్న సమయంలో పీసీబీ చీఫ్ కప్‌ను తీసుకెళ్లడం వారికి తలవంపులు తెచ్చింది. దీంతో, నెట్టింట పాక్ జనాలు తమ ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు (Asia Cup Loss Pak Trolled).
‘భారత్‌పై నెగ్గాలని పాక్ ఎంతగా తపించినా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్లు మనకు బాబు లాంటోళ్లు’ అని ఓ పాక్ అభిమాని నిర్వేదం వ్యక్తం చేశాడు. ‘భారత్‌పై విజయం ఈ తరంలో చూస్తామో లేదో తెలియట్లేదు. వాళ్ల కాళ్ల గోటికి కూడా మనం సమానం కాదు. మనతో చేతులు కలపకుండా టీమిండియా సభ్యులు మంచి పనే చేశారు’ అని మరో వ్యక్తి అన్నారు (Fans Angry at Pak Team).
మరోసారి పాక్ అభిమానులకు నిరాశ తప్పలేదని కొందరు అన్నారు. మూడో సారి ఘోరంగా విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు. మొదట్లో కొంత ఆశగా అనిపించినా టీమిండియా పాక్ జట్టు కంటే చాలా దృఢమైనదని అంగీకరించారు. పులితో తలపడి పాక్ దెబ్బతిందని అన్నారు.
భారత్‌ను పాక్ క్రికెటర్ రవూఫ్ రెచ్చగొట్టడమే తమ కొంప ముంచిందని పాక్ యూట్యూబర్ ఉబెర్ అఫ్జల్ అన్నారు. ప్లేన్ కూల్చినట్టు, తుపాకీ పేల్చినట్టు మైదానంలో పాక్ ప్లేయర్లు సైగలు చేయడంపై అతడీ కామెంట్ చేశాడు. ‘భారత్ జట్టును ఎదుర్కొన్నప్పుడల్లా పాక్ తత్తరపాటుకు లోనుకావడం అలవాటే. మొదట్లో బాగానే మ్యాచ్‌ను ప్రారంభించినా ఆ తరువాత మనం వికెట్లను యుద్ధ విమానాల్లా కోల్పోయాం’ అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఇవి కూడా చదవండి
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి