Share News

IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ..రోహిత్‌కు నో ఛాన్స్!

ABN , Publish Date - Nov 06 , 2025 | 03:00 PM

భారత-ఏ జట్టును ప్రకటించే ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై పలు వార్తలు వచ్చాయి. అనధికారిక వన్డే సిరీస్ లో వీరిద్దరు ఆడుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వలేదు.

 IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ..రోహిత్‌కు నో ఛాన్స్!
Tilak Varma

క్రీడా వార్తలు: దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో భారత్-ఏ జట్టు మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్-ఏ జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో భారత్ -ఏ కెప్టెన్ గా తెలుగు తేజం తిలక్(Thilak Varma) వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. తిలక్ వర్మ సారథ్యంలో 15 మంది సభ్యులు గల భారత్-ఏ జట్టు వివరాలను బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 13, 16, 19 తేదీల్లో జరిగే ఈ మూడు అనధికార వన్డేల్లో భారత్-ఏ(Team India) జట్టును తిలక్ నడిపించనున్నాడు.


ఈ జట్టును ప్రకటించే ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli)పై పలు వార్తలు వచ్చాయి. అనధికారిక వన్డే సిరీస్ లో వీరిద్దరు ఆడుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వలేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఈ అనధికార సిరీస్ జరగనుంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కోహ్లీ, రోహిత్(Rohit Sharma) బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కానీ సెలెక్టర్లు కుర్రాళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు.


టీమిండియా యంగ్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ(Abhishek Sharma), రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా‌లు ఈ సిరీస్‌లో చోటు దక్కించుకుంది. వీరితో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్‌లు కూడా భారత్-ఏ జట్టులో ఎంపికయ్యారు. ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిమ్, ప్రభ్ సిమ్రాన్ వంటి ఐపీఎల్ స్టార్లకు కూడా చోటు దక్కింది. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో సౌతాఫ్రికా(South Africa)తో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. డిసెంబర్ 9, 11, 14,17,19 తేదీల్లో ఐదు టీ20 మ్యాచ్‌లు జరగుతాయి.


భారత్-ఏ జట్టు: తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.


ఈ వార్తలు కూడా చదవండి:

1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్

హ్యాపీ బర్త్‌డే విరాట్!

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 06 , 2025 | 03:46 PM