Share News

Rishabh Pant comeback: పంత్‌ వచ్చేశాడు

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:05 AM

వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు బుధవారం ప్రకటించిన...

Rishabh Pant comeback: పంత్‌ వచ్చేశాడు

  • షమికి మొండిచేయిఫ దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీ్‌సకు జట్టు

న్యూఢిల్లీ: వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు బుధవారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో పంత్‌కు చోటు కల్పించారు. అయితే సుదీర్ఘకాలంగా జట్టులోకి రావాలని చూస్తున్న పేసర్‌ మహ్మద్‌ షమికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల షమి కెరీర్‌ ముగిసినట్టేనని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ 14నుంచి కోల్‌కతాలో జరగనుంది. ఈ టెస్ట్‌ సిరీ్‌సకు ఎన్‌. జగదీశన్‌ స్థానంలో పంత్‌కు చోటు దక్కింది. అంతేకాదు రిషభ్‌ను వైస్‌-కెప్టెన్‌గానూ నియమించారు. భుజం గాయంనుంచి కోలుకున్న బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప కూడా సఫారీలతో టెస్ట్‌ సిరీ్‌సకు జట్టులోకి వచ్చాడు. స్పిన్‌ విభాగం బాధ్యతలను జడేజా, అక్షర్‌, కుల్దీప్‌, సుందర్‌ పంచుకోనున్నారు. కాగా..బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌దీ్‌పలతో పేస్‌ బౌలింగ్‌ బలంగా ఉంది.

భారత టెస్ట్‌ జట్టు: గిల్‌ (కెప్టెన్‌), పంత్‌ (వైస్‌-కెప్టెన్‌), జైస్వాల్‌, రాహుల్‌, సాయి సుదర్శన్‌, పడిక్కళ్‌, జురెల్‌, జడేజా, సుందర్‌, బుమ్రా, అక్షర్‌, నితీశ్‌ రెడ్డి, సిరాజ్‌, కుల్దీప్‌, ఆకాశ్‌దీ్‌ప.

భారత్‌ ‘ఎ’ కెప్టెన్‌ తిలక్‌ వర్మ

దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత్‌ ‘ఎ’ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మను కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లు ఈనెల 13, 16, 19 తేదీల్లో రాజ్‌కోట్‌లో జరగనున్నాయి.

షమికి ఇక కష్టమేనా?

ఇటీవల మూడు రంజీ మ్యాచ్‌ల్లో బెంగాల్‌ తరపున 15 వికెట్లతో రాణించిన పేసర్‌ షమిని సెలెక్టర్లు జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదు. కానీ సుదీర్ఘ స్పెల్స్‌ వేయాల్సిన టెస్ట్‌లకు అతడి శరీరం సహకరించదేమోనన్న అభిప్రాయంలో సెలెక్టర్లు ఉన్నట్టు తెలిసింది. అలాగే తన ఫిట్‌నెస్‌ గురించి తాజా సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత తనది కాదని ఇటీవల షమి వ్యాఖ్యానించడం ప్రతికూలంగా మారినట్టు భావిస్తున్నారు.

Updated Date - Nov 06 , 2025 | 05:05 AM