Tilak Varma: విరాట్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:59 PM
టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ .. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో సరికొత్త రికార్డను సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ ఛేదనలో అత్యుత్తమ సగటుతొ పరుగులు సాధించిన ప్లేయర్ గా తిలక్ నిలిచాడు. దీంతొ ఇన్నాళ్లుగా టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును ఈ తెలుగు కుర్రాడు బద్దలు కొట్టాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో వర్మ (Tilak Varma) బాగా బిజీగా ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పుల నేపథ్యంలో కటక్ వేదికగా తొలి టీ20లో నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ32 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
ఇక ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లోనూ ఇదే స్థానంలో ఆడిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో వర్మ పోరాటం వృథాగా పోయింది. భారత్ ఓటమి పాలైంది. తాజాగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో మాత్రం తిలక్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా(South africa) విధించిన 118 పరుగుల టార్గెట్‌ను భారత్15.5 ఓవర్లలోనే పూర్తి చేసింది.
తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఈ తెలుగు కుర్రాడు అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ టీ20 టోర్నీలో లక్ష్య ఛేదనలో టెస్టు హోదా కలిగిన దేశాల్లో కనీసం 500 పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.
టీ20 ఫార్మాట్లో టార్గెట్ ఛేదనలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్లు:
తిలక్ వర్మ (భారత్)- 68.0 సగటుతో
విరాట్ కోహ్లి (భారత్)- 67.1 సగటుతో
ఎంఎస్ ధోని (భారత్)- 47.71 సగటుతో
జేపీ డుమిని (దక్షిణాఫ్రికా)- 45.55 సగటుతో
సంగక్కర (శ్రీలంక)- 44.93 సగటుతో.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు