The Ashes: మూడో రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Dec 19 , 2025 | 01:44 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 271/4 స్కోర్ చేసింది. హెడ్(142) అజేయ శతకంతో నిలిచాడు. దీంతో ఇంగ్లండ్‌పై ఆసీస్ 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అడిలైడ్ వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 66 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఇంగ్లండ్‌పై ప్రదర్శిస్తుంది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(142*) అద్భుత సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో అలెక్స్ కెరీ(52*)హాఫ్ సెంచరీతో సూపర్ నాక్ ఆడుతున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ ఐదో వికెట్‌ను అజేయంగా 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తొలుత 213/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. బెన్‌స్టోక్స్ (83), జోఫ్రా ఆర్చర్ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బోల్యాండ్ చెరో మూడు, నాథన్ లైయన్ 2, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసుకున్నారు.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో జేక్ వెదర్లాడ్ (1), లబుషేన్ (13), కామెరూన్ గ్రీన్ (7) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. ఉస్మాన్ ఖవాజా (40; 51 బంతుల్లో, 4 ఫోర్లు) రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన గ్రీన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2, బ్రైడర్ కార్స్, విల్ జాక్స్ తలో వికెట్ తీసుకున్నారు.
ఇవీ చదవండి:
చిరస్మరణీయం.. ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది!
జట్టుకు ఇది సరిపోదు.. గిల్ ఫామ్‌పై మాజీ బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు