Temba Bavuma: అదే మా ఓటమికి కారణమైంది: టెంబా బవుమా
ABN , Publish Date - Dec 07 , 2025 | 08:03 AM
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో వన్డే మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్ కారణమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారత స్నిన్నర్లు తమ పతనాన్ని శాసించారని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో టెస్టు సిరీస్ విజయం తర్వాత రెట్టింపు ఆత్మవిశ్వాసంతో వన్డే బరిలోకి దిగింది సౌతాఫ్రికా. తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ.. ఎక్కడా తగ్గకుండా గట్టి పోటీ ఇస్తూ రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. వైజాగ్ వేదికగా జరిగిన డిసైడింగ్ మూడో వన్డేలో కాస్త తడబడి.. సిరీస్ చేజార్చుకుంది. ఫలితం.. టీమిండియా ఘన విజయం. తమ ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
‘ఈ మ్యచ్‌ను కూడా మేం ఉత్సాహంగా మార్చాలనుకున్నాం. కానీ బ్యాటింగ్‌లో మా జట్టు విఫలమైంది. అనవసర షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నాం. ఇంకాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. భారత స్పిన్నర్లు మా పతనాన్ని శాసించారు. టీమిండియా తమ సత్తా ఏంటో చూపించింది. వారికి నా అభినందనలు. తొలి రెండు వన్డేల్లో మేం అద్భుత ప్రదర్శన చేశాం. కానీ మూడో వన్డేలో రాణించలేకపోయాం. వన్డేల్లో ఆలౌట్ అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు. డికాక్(106) అద్బుత ప్రదర్శన చేశాడు. నేను(48) కూడా ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారిపై ఒత్తిడి తీసుకురావడం అంత సులువైన పని కాదు’ అని బవుమా వెల్లడించాడు.
తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డికాక్(106), బవుమా(48) మినహా మిగతా బ్యాటర్లంతా రాణించలేకపోయారు. కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. 270 పరుగులు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియాకు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(116*) తన తొలి వన్డే శతకం చేయగా.. రోహిత్ శర్మ(75), విరాట్ కోహ్లీ(65*) చెలరేగారు. 39.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ సొంతం చేసుకుంది టీమిండియా.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271
రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్