Ind Vs SA: రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:48 PM
వైజాగ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్(106) అద్భుత సెంచరీ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లలో 7 సెంచరీలు చేసి సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-సౌతాఫ్రికా మధ్య వైజాగ్ వేదికగా మూడో వన్డే కొనసాగుతోంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలుచుకోవాలని ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ప్రొటీస్ జట్టును బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్‌కు ర్యాన్ రికెల్టన్(0) రూపంలో శుభారంభం దక్కింది. అయినప్పటికీ ఇతర ఓపెనర్ క్వింటన్ డికాక్(106) అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయిన డికాక్.. ఈ డిసైడింగ్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియాపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. భారత్‌పై డికాక్‌కు ఇది ఏడో సెంచరీ. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉంది. అతడు టీమిండియాపై 85 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సెంచరీలు చేశాడు. అయితే క్వింటన్ డికాక్ కేవలం 24 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకోవడం విశేషం. భారత్‌తో ఆడిన తొమ్మిది సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన డికాక్.. ఏడు సార్లు ఆ స్కోరును సెంచరీగా మలిచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
Seema Punia: సీమా పునియాకు భారీ షాక్.. 16 నెలల నిషేధం
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్