Ind Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:28 PM
వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్‌దీప్-ప్రసిద్ధ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. సిరీస్ గెలవాలంటే భారత్ 271 పరుగులు చేధించాలి.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-సౌతాఫ్రికా మధ్య వైజాగ్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 47.5 ఓవర్లు ఆడి 270 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సౌతాఫ్రికా(Ind Vs SA)ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఓవర్‌లోనే ర్యాన్ రికెల్టన్(0)ను ఔట్ చేసిన అర్ష్‌దీప్ టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(106) అద్భుత సెంచరీతో సౌతాఫ్రికా భారీ స్కోరుగా దిశగా పయనించింది. మరో ఎండ్‌లో సఫారీ సేన కెప్టెన్ టెంబా బవుమా(48) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. డికాక్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ పార్ట్‌నర్‌షిప్‌ను జడేజా బ్రేక్ చేశాడు.
అనంతరం వచ్చిన బ్రీట్జ్కే(24) క్రీజులో ఉన్న కాసేపు సిక్సులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మార్క్‌రమ్(1) తీవ్రంగా నిరాశపర్చాడు. బ్రెవిస్(29), యాన్సెన్(17) పర్వాలేదనిపించారు. ఆఖర్‌లో వచ్చిన కేశవ్ మహరాజ్(20) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కీలక పరుగులు రాబట్టాడు. బోష్(9), లుండి ఎంగిడి(1), బార్ట్‌మన్(3) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Seema Punia: సీమా పునియాకు భారీ షాక్.. 16 నెలల నిషేధం
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్