Suryakumar Yadav: పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలను ఎలా ఎదుర్కొన్నారు.. సూర్యకుమార్ యాదవ్ సమాధానం
ABN , Publish Date - Sep 29 , 2025 | 05:23 PM
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కానీ పాకిస్థాన్ ఆటగాళ్లు.. భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు పలు మార్లు ప్రయత్నించారు. అయితే వాటిని ఎలా ఎదుర్కొన్నారని ఓ మీడియా ప్రశ్నించగా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బదులిచ్చారు.
ఆసియా కప్-2025 ఎట్టకేలకు ముగిసింది. చారిత్రాత్మక ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మూడుసార్లు పోటీ పడగా.. ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే మ్యాచ్ కంటే పాకిస్థాన్ జట్టు ప్రవర్తన, వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలోని పాక్ జట్టు వరుసగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా భారత జట్టు మాత్రం తమ స్థిరత్వాన్ని కోల్పోకుండా ఆడింది. దీని గురించి జాతీయ మీడియా ప్రశ్నించగా.. భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు.
ఎలాంటి ఫలితం వచ్చినా..
ఈ రెండు జట్ల మధ్య తేడా చాలా ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. 'మేము ఎప్పుడూ సైగలు, చేతులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. గౌరవంతో ఆట ఆడాలనుకున్నాం. అదే చేశాం. ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా రావచ్చు, రాకపోవచ్చు. కానీ, తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆడిన ఆట, చేసిన ప్రయత్నం సంతోషంగా ఉండాలి. నేను నా ఆటగాళ్లకు ఒకటే చెప్పా. భావోద్వేగాలను పక్కన పెట్టి, మంచి ఆట ఆడాలని సూచించా. చివరకు ఫలితం ఎలా వచ్చినా, స్వీకరిద్దామని చెప్పానని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
బీసీసీఐకి కృతజ్ఞతలు
దీంతోపాటు సూర్యకుమార్ యాదవ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై కూడా ప్రశంసలు కురిపించారు. ఆసియా కప్ సమయంలో బీసీసీఐ.. జట్టుకు మంచి సపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆటగాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించిందని చెప్పారు. బీసీసీఐ మా ముందు గోడలా నిలిచి, పూర్తి మద్దతు ఇచ్చింది. అందుకే మంచి క్రికెట్ ఆడి, ట్రోఫీలు గెలిచి బోర్డ్‌కు తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీసీఐ అందించిన సౌకర్యాలు, మద్దతు ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, అందుకే ఇలాంటి టోర్నీ గెలువగలిగినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి