Sri Charani: క్రికెట్ కోసం పరీక్షలు రాయనని బెదిరించా.. నారా లోకేశ్‌తో శ్రీచరణి
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:51 PM
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో శ్రీ చరణి.. తన క్రికెట్ ప్రయాణం గురించి పంచుకుంది. క్రికెట్ ఆడేందుకు పరీక్షలు రాయనని తరుచు బెదిరించేదానని తెలిపింది.
క్రీడా వార్తలు: మహిళల ప్రపంచకప్ 2025(women World cup)లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి, యువ స్పిన్నర్ శ్రీ చరణి ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయ్యింది. అయితే ఆమెకు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు పడింది. క్రికెట్ కోసం ఎగ్జామ్స్ రాయనని తన తండ్రిని తరుచూ బెదించేదానినని ఆమె తెలిపింది. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)తో శ్రీ చరణి ఇంటరాక్షన్ జరిగింది. ఈ క్రమంలో అనేక విషయాలను ఆమె వెల్లడించారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో శ్రీ చరణి(Sri Charani) తన క్రికెట్ ప్రయాణం గురించి పంచుకుంది. క్రికెట్ ఆడేందుకు పరీక్షలు రాయనని తరుచు బెదిరించేదానని తెలిపింది. ఆమె మాటలతో నారా లోకేష్‌తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) పగలబడి నవ్వారు. తాజా ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించడం, శ్రీ చరణికి కూడా మంచి పేరు రావడంతో.. ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
శ్రీచరణి(Sri Charani) మాట్లాడుతూ...'మాది ఏపీలోని కడప(Kadapa). నా 8 ఏళ్ల వయసులోనే మా మామ ద్వారా క్రికెట్ ఆడటం ప్రారంభించాను. మా గ్రామంలో ప్రొఫెషనల్ గా క్రికెట్ ఆడే సదుపాయాలు లేవు. గల్లీ క్రికెట్ మాత్రమే ఆడేదాన్ని. నా 9వ తరగతి పూర్తయిన తర్వాత నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఈ విషయం మా తల్లిదండ్రులకు చెబితే.. తొలుత ఒప్పుకోలేదు.
రెండేళ్ల తర్వాత నా మొండితనాన్ని భరించలేక క్రికెట్ ఆడేందుకు నాన్న అంగీకరించాడు. కానీ ఆయన ఒప్పుకునే సమయానికి కరోనా(Covid-19) వచ్చింది. దాంతో రెండేళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. కోవిడ్ 19 తర్వాత అండర్ 19 ప్రాబబుల్స్‌లో నేను సెలెక్టయ్యాను. ఆ తర్వాత ఏపీ తరఫున స్టేట్ మ్యాచ్‌లు ఆడాను.ఐదేళ్ల ప్రొఫెషనల్ క్రికెట్ జర్నీ తర్వాత నాకు డబ్ల్యూపీఎల్(WPL) ఆడే అవకాశం దక్కింది. ఆ టోర్నీలో రాణించడంతో టీమిండియాకు ఎంపికయ్యాను'అని శ్రీ చరణి(Sri Charani) చెప్పుకొచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి