Tazmin Brits: చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: స్టార్ క్రికెటర్
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:24 PM
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2025లో సౌతాఫ్రికా మహిళా ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. న్యూజిలాండ్‌పై టాజ్మిన్ బ్రెట్స్ భారీ శతకం సాధించింది. గత 6 వన్డేల్లో 4 సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉంది.
ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు, సమస్యలు రావడం అనేది సర్వసాధారణం. అయితే కొన్ని అనూహ్య ఘటనలు ఆత్మహత్యకు దారి తీస్తాయి. ఇలా సామాన్యుల నుంచి సినీ, రాజకీయ, క్రీడ సెలబ్రిటీల వరకు కొందరు ఆత్మహత్యలు చేసుకోవాలని భావించారు. తమ జీవితంలో ఎదురైన విపత్కర పరిస్థితుల గురించి చాలా మంది ప్రముఖులు వివిధ ఇంటర్వ్యూల్లో తెలిపారు. జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనతో చచ్చిపోవాలనుకున్నానని, పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశానని ఓ స్టార్ క్రికెటర్ తెలిపింది. మరి..ఆమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2025(Women’s Cricket World Cup 2025)లో సౌతాఫ్రికా మహిళా ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్(Tajmin Brits) అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. న్యూజిలాండ్‌పై టాజ్మిన్ బ్రెట్స్ భారీ శతకం సాధించింది. గత 6 వన్డేల్లో 4 సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉంది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా ఏడు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా మెగ్ లానింగ్‌తో సహా పలు రికార్డులను బద్దలుకొట్టింది. అయితే ఈమె క్రికెట్(Cricket) ప్రయాణం చాలా విభిన్నంగా సాగింది.
తాజాగా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురైంది. '2010లో జరిగిన రోడ్డు ప్రమాదంతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ బాధను భరించలేక చచ్చిపోవాలనుకున్నాను. అనేక సార్లు సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేశాను. ఆ సమయంలో నిరంతరం నన్ను ఆత్మహత్య ఆలోచనలు వెంటాడేవి. కానీ నాకు నా తల్లిదండ్రులు అండగా నిలిచారు. ఆ దేవుడు నా విధిరాతలో క్రికెటర్ కావాలని రాసాడేమో.. అందుకే జావెలిన్ త్రోయర్ కావాల్సిన నేను క్రికెటర్ అయ్యాను.'అని టాజ్మిన్ బ్రిట్స్(South Africa women cricketers) చెప్పుకొచ్చింది. జీవితంలో ప్రతీ ఒక్కరికి సెకండ్ ఛాన్స్ లభిస్తుందని, ఆ అవకాశం కోసం ఎదురు చూడాలని బ్రెట్స్ తెలిపింది.
అథ్లెటిక్స్ నుంచి క్రికెటర్ గా
వాస్తవానికి టాజ్మిన్ బ్రెట్స్(Tajmin Brits) అథ్లెటిక్స్ కెరీర్‌ను ఎంచుకుంది.16 ఏళ్ల వయసులోనే ప్రపంచ అథ్లెటిక్స్ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 2010 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కానీ లండన్ ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు బ్రిట్స్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హిప్,పెల్విస్ ఎముకలు విరిగిపోయాయి. దాంతో ఆమె రెండు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంది. అనుకోని ఈ ప్రమాదంతో ఆమె ఆస్పత్రి బెడ్ పై అచేన స్థితిలో ఉంది. ఇక బ్రెట్స్ చూసిన వాళ్లు ఆమె నడవడం కూడా కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఓ స్నేహితుడి సూచనతో సరదాగా క్రికెట్ ఆడటం ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత కెరీర్‌గా ఎంచుకుంది. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో పరుగుల మోత మోగిస్తుంది. నిరాశతో, జీవితంపై విరక్తితో కుంగిపోయే వారికి టాజ్మిన్ బ్రెట్స్(South Africa women cricketers,) లైఫ్ స్ఫూర్తిని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
Jaiswal Missed Double Century: గిల్ తప్పిదం.. చేజారిన యశస్వి ద్విశతకం!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి