Share News

Smriti Mandhana: నా వల్లే ఈ ఓటమి.. స్మృతి మంధాన కీలక కామెంట్స్

ABN , Publish Date - Oct 20 , 2025 | 03:10 PM

భారత్ ఓటమిపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)స్పందించారు. తమ జట్టు పరాజయానికి తనదే పూర్తి బాధ్యత ఆమె తెలిపింది. తన వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని, తన షాట్ ఎంపిక ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడింది.

Smriti Mandhana: నా వల్లే ఈ ఓటమి.. స్మృతి మంధాన కీలక కామెంట్స్
Smriti Mandhana

క్రికెట్ న్యూస్: ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీలో భారత్ ఓటముల పరంపర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఇండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఒత్తిడిని తట్టుకోలేక చేజేతులా చేజార్చుకుంది. గెలుపు ముంగిట చెత్త షాట్లతో భారీ మూల్యం చెల్లించుకుంది.


ఇక భారత్ ఓటమిపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)స్పందించారు. తమ జట్టు పరాజయానికి తనదే పూర్తి బాధ్యత ఆమె తెలిపింది. తన వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని, తన షాట్ ఎంపిక ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవ్వడంతో స్మృతి కన్నీరు పెట్టుకుంది. తదుపరి మ్యాచ్‌లో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతానని తెలిపింది. ఈ మ్యాచ్‌లో చాలా బలంగా కనిపించిన తమ బ్యాటింగ్..అనూహ్యంగా ఒక్కసారిగా కూలిపోయిందని ఆమె వెల్లడించింది.

విజయ సమీకరణం బంతికి ఒక పరుగు ఉన్నా కూడా తాము చెత్త షాట్స్‌తో మూల్యం చెల్లించుకున్నామని విచారం వ్యక్తం చేసింది. తమ జట్టు పతనం తనతోనే మొదలైందని, కాబట్టి ఈ ఓటమికి తనదే పూర్తి బాధ్యతని స్మృతి చెప్పుకొచ్చింది. తన షాట్ సెలెక్షన్ కాస్త తెలివిగా ఉండాల్సిందని, గెలుస్తున్న సమయంలో చెత్తా షాట్స్ ఆడకుండా మ్యాచ్‌ను మరింత డీప్‌ తీసుకెళ్లాల్సిందని స్మృతి(Smriti Mandhana) అభిప్రాయ పడింది.


ఇంకా స్మృతి మాట్లాడుతూ...'తదుపరి మ్యాచ్ గురించి ఇప్పుడే మాట్లాడాల్సిన పనిలేదు. కానీ సెమీఫైనల్ చేరాలంటే తదుపరి మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. ఈ మ్యాచ్ మాకు క్వార్టర్ ఫైనల్ లాంటిది. తదుపరి మ్యాచ్ లో విజయం సాధించేందుకు కృషి చేస్తాము. ఈ ఓటమిని మేం ఓ గుణ పాఠంగా తీసుకుంటాం.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది. భారత్ కు(India Women Cricket)తదుపరి మ్యాచ్ లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్(India vs Bangladesh)తో జరగనున్నాయి. ఇండియా సెమీస్ కు చేరాలంటే ఈ రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడిన సెమీస్ పై ఆశలు వదరుకోవాల్సిందేనని క్రీడా నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 03:40 PM