Shubman Gill: ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:20 PM
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇవాళ(గురువారం) జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. ఈ విజయంతో ఆసీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
క్రికెట్ న్యూస్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్(India vs Australia)లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇవాళ(గురువారం) జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. ఈ విజయంతో ఆసీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం అధికార బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన టీమిండియా శుభ్‌మన్ గిల్.. టాస్ ఓడిపోవడం పెద్దగా ప్రభావం చూపలేదన్నాడు. కీలక క్యాచ్ లు వదిలేయడంతోనే ఓడిపోయామని తెలిపాడు.
శుభ్‌మన్ గిల్(Shubman Gill)మాట్లాడుతూ.. తాము పోరాడే టార్గెట్ నే నమోదు చేశామని, కానీ కీలక క్యాచ్ లు వదిలేస్తే ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా కాపాడుకోలేమని అన్నాడు. తొలి మ్యాచ్ లో టాస్ గెలవడం కీలకం, కానీ ఈ మ్యాచ్ లో టాస్ అంత కీలకం కాదని గిల్ అన్నాడు. ఇరు జట్లు 50 ఓవర్లు ఆడాయని, 15-20 ఓవర్ల తర్వాత వికెట్ సెటిల్ అయ్యిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, సుదీర్ఘ విరామం తర్వాత వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం అంత సులువు కాదని రోహిత్ శర్మ(Rohit Sharma)ను ప్రశంసించాడు. మ్యాచ్ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు సవాలుగా ఉందని, కానీ రోహిత్ అద్భుతంగా ఆడాడని గిల్(Shubman Gill) చెప్పుకొచ్చాడు.
అడిలైడ్ వన్డేలో(India vs Australia) భారత్ మూడు కీలక క్యాచ్‌లు నేలపాలు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మాథ్యూ షార్ట్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ పటేల్ జారవిడిచాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సిరాజ్ క్యాచ్ వదిలేశాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను నితీష్ వదిలేశాడు. ఈ మూడు క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. రెండు అవకాశాలతో మాథ్యూ(74) చెలరేగి ఆడి.. భారత్ పతనాన్ని శాసించాడు.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..