Thefts Near Dwaraka Tirumala: ద్వారకా తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్..
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:05 PM
తిరుగు ప్రయాణంలో తల్లీకొడుకులు ద్వారకా తిరుమల బస్టాండులో బస్ ఎక్కారు. బస్ ఎక్కిన తర్వాత సత్యవాణి తన బ్యాగ్ చెక్ చేసుకుంది. బ్యాగులో ఉంచిన బంగారం, వెండి ఉన్న పర్సు పోయినట్లు గుర్తించింది.
ద్వారకా తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ ఆర్టీసీ బస్టాండ్‌ను అడ్డాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సీఐ విల్సన్ తెలిపారు. భీమడోలు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సీఐ విల్సన్ తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా, భీమిలి మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన గొడుగు సత్యవాణి తన కుమారుడితో కలిసి సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం రాళ్ల గుంటలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైంది. తిరుగు ప్రయాణంలో తల్లీకొడుకులు ద్వారకా తిరుమల బస్టాండులో బస్ ఎక్కారు. బస్ ఎక్కిన తర్వాత సత్యవాణి తన బ్యాగ్ చెక్ చేసుకుంది. బ్యాగులో ఉంచిన బంగారం, వెండి ఉన్న పర్సు పోయినట్లు గుర్తించింది.
దాన్ని ఎవరో దొంగిలించారని భావించిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ద్వారకా తిరుమల బస్టాండ్ దగ్గర దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను, ఆమెకు సహకరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 33.5 గ్రాముల బంగారం, 117గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో వాయు కాలుష్యం.. పంజాబ్‌లో పెరుగుతున్న పంట వ్యర్థాల దగ్ధం కేసులు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత..