Shubman Gill Creat Record: శుభ్‌మన్ గిల్ అరుదైన ఫీట్..పంత్ రికార్డు బ్రేక్
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:55 PM
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ 85 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇప్పటి వరకు గిల్ 2,757 పరుగులు చేశాడు. అతడి తర్వాత రిషభ్ పంత్ (2,731), రోహిత్ శర్మ (2,716), విరాట్ కోహ్లీ (2,617) ఉన్నారు.
IND VS WI: ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్బుతంగా రాణిస్తున్నాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్..సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, ఈ యువ ఓపెనర్ వరుసగా రెండో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో అతడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల దాటి గిల్ టాప్ లోకి వెళ్లాడు.
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్(Shubman Gill ) 85 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో(ICC World Test Championship) భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇప్పటి వరకు గిల్ 2,757 పరుగులు చేశాడు. అతడి తర్వాత రిషభ్ పంత్ (2,731), రోహిత్ శర్మ (2,716), విరాట్ కోహ్లీ (2,617) ఉన్నారు. డబ్ల్యూటీసీలో గిల్ 39 మ్యాచ్‌లు ఆడి 42.41 సగటుతో 2,757 పరుగులు చేశాడు. WTCలో ఇప్పటివరకు అతని అత్యధిక స్కోరు 269. అలానే అతను 9 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో తన అత్యధిక పరుగుల రికార్డును గిల్ మెరుగుపర్చుచున్నాడు. 2024లో 22 ఇన్నింగ్స్‌ల్లో 866 పరుగులు చేయగా.. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లోనే 912 పరుగులు రాబట్టాడు.
అయితే ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ 52.86 సగటుతో 6,080 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (49.74 వద్ద 4,278 పరుగులు), మార్నస్ లాబుస్చాగ్నే (48.01 వద్ద 4,225 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో గిల్ 11వ స్థానంలో ఉన్నాడు. అలానే WTCలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలానే రోహిత్ శర్మ, కోహ్లీ(Kohli), రిషబ్ పంత్‌ల(Rishabh Pant)ను అధిగమించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. వేగంగా ఆడే క్రమంలో 43 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు క్రీజ్‌లో పాతుకుపోయిన కెప్టెన్ గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రెండో సెషన్‌లో మరో వందకు పైగా పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం భారత్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 480 పరుగులు దాటింది.
ఇవి కూడా చదవండి:
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
Jaiswal Missed Double Century: గిల్ తప్పిదం.. చేజారిన యశస్వి ద్విశతకం!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి