Sai Sudharsan Stunning Catch: కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న సాయి సుదర్శన్
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:05 PM
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో (7.2 ఓవర్)లో జాన్ కాంప్‌బెల్ (10) సుదర్శన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత పట్టు సాధిస్తోంది. ఇప్పటికే బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 518 పరుగులు చేసింది. అలానే బౌలింగ్ లోనూ టీమిండియా దుమ్మురేపుతోంది. 150 లోపే విండీస్ వి నాలుగు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రవీంద్ర జడేజా(Jadeja) బౌలింగ్‌లో (7.2 ఓవర్)లో జాన్ కాంప్‌బెల్ (10) సుదర్శన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ విండీస్ ఓపెనర్ బలమైన స్లాగ్ స్వీప్ షాట్ ఆడగా.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి సుదర్శన్(Sai Sudharsan) క్యాచ్ ను అద్బుతంగా అందుకున్నాడు. బ్యాటర్ షాట్ గట్టిగా కొట్టడంతో అలర్టైన సుదర్శన్ చేతులను అడ్డుగా పెట్టాడు.
ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన బంతి తొలుత సాయి చేతికి తాకి హెల్మెట్‌కు తగిలింది. అనంతరం బంతి కిందపడిపోతుండగా సాయి ఏ మాత్రం తడబడకుండా బాల్‌ని ఒడిసిపట్టాడు. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో బాల్ స్పీడ్ గా వచ్చి సాయి చేతికి బలంగా తాకింది. దీంతో చేతికి గాయం కావడంతో సుదర్శన్(Sai Sudharsan) మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో విండీస్(West Indies) 140/4తో నిలిచింది. క్రీజులో హోప్(31*), టెవిన్(14*) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
IPL 2026: CSK రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి