Share News

Rovman Powell Shines: టీ20 లీగ్‌లో వెస్టిండీస్ వీరుడి విధ్వంసం

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:20 PM

దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో కరేబియన్ వీరుడి రోవ్‌మన్‌ పావెల్‌ విధ్వంసం సృష్టించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడిన పావెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. శతకానికి చేరువయ్యాడు. ఓవర్లు పూర్తి కావడంతో తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు

 Rovman Powell Shines:  టీ20 లీగ్‌లో వెస్టిండీస్ వీరుడి విధ్వంసం
Rovman Powell

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల టీ20 లీగ్స్ లో కొందరు ప్లేయర్లు దుమ్మురేపుతున్నారు. అంతేకాక అనేక రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు. తాజాగా వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ రోవ్‌మన్ పావెల్ (Rovman Powell) దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో విధ్వంసం సృష్టించాడు. దుబాయ్‌ క్యాపిటల్స్‌(Dubai Capitals) తరఫున ఆడుతున్న పావెల్‌.. నిన్న (ఆదివారం) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 96 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని శతకం కూడా పూర్తి చేసేవాడు. పావెల్ దెబ్బకు అబుదాబీ నైట్ రైడర్స్ జట్టు బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి. పావెల్‌ మెరుపులకు జోర్డన్‌ కాక్స్‌ (36 బంతుల్లో 52) అర్ధ శతకం తోడు కావడంతో క్యాపిటల్స్ మంచి స్కోర్ చేసింది


ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. తొలుత బ్యాటింగ్‌ చేసిన దుబాయ్ క్యాపిటల్స్(Dubai Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ జట్టులో పావెల్‌, కాక్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. టాబీ ఆల్బర్ట్‌, సెదిఖుల్లా అటల్‌ తలో 8 పరుగులు చేయగా... షయాన్‌ జహంగీర్‌ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అబుదాబీ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2 సాధించగా, అజయ్‌ కుమార్‌, పియూశ్‌ చావ్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం 187 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన అబుదాబీ నైట్ రైడర్స్ జట్టు తడబడింది.


వకార్‌ సలామ్‌ఖీల్‌ 4 వికెట్లు తీసి అబుదాబీ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. అలానే మహ్మద్‌ నబీ 2, డేవిడ్‌ విల్లే 2, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 2 వికెట్లు సాధించారు. క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్‌రైడర్స్‌(Abu Dhabi Night Riders) ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అలానే ఈ జట్టులోని విధ్వంసకర వీరులు లివింగ్‌స్టోన్‌ (16), రూథర్‌ఫోర్డ్‌ (19), రసెల్‌ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విండీస్ వీరుడు రోవ్‌మన్ పావెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్అవార్డును దక్కించుకున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

India T20 Squad: స్టార్‌ ప్లేయర్‌పై వేటు... టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే?

87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!

Updated Date - Dec 08 , 2025 | 03:42 PM