Real Vs Fake Eggs: గుడ్లు కొనేటప్పుడు జాగ్రత్త.. కల్తీ గుడ్లను ఇలా గుర్తించండి..!
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:41 PM
కల్తీ గుడ్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మార్కెట్‌లో కల్తీ గుడ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే అవి అధిక ప్రోటీన్, విటమిన్లు A, D, E, B12, ఖనిజాలు, కోలిన్, యాంటీఆక్సిడంట్‌లతో నిండి ఉంటాయి. ఇవి కండరాల అభివృద్ధి, మెదడు ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే బరువు తగ్గడంలో కూడా తోడ్పడతాయి. రోజుకు 1-2 గుడ్లు తినడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ, ఈ రోజుల్లో నకిలీ గుడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, కల్తీ గుడ్లను మార్కెట్‌లో ఇలా గుర్తించండి..
షెల్‌ను గమనించండి
నిజమైన గుడ్ల పెంకు కొంచెం గరుకుగా ఉంటుంది.
నకిలీ గుడ్ల పెంకు మెరుస్తూ కనిపిస్తుంది. పెంకు చాలా నునుపుగా ఉంటుంది.
గుడ్డును చేతిలో పట్టుకుని స్వల్పంగా కదిలించండి. నిజమైన గుడ్లలో శబ్దం రాదు.
నకిలీ గుడ్లలో శబ్దం వచ్చినట్లు అనిపిస్తుంది.
నిజమైన గుడ్డు పచ్చసొన గుండ్రంగా, గట్టిగా ఉంటుంది.
నకిలీ గుడ్డు పచ్చసొన వదులుగా, సులభంగా విరిగిపోతుంది. తెల్లగా కొన్నిసార్లు చాలా మందంగా లేదా చాలా నీరుగా ఉంటుంది.
నకిలీ గుడ్లు పూర్తిగా కృత్రిమంగా తయారు చేస్తారు. జెలటిన్, రంగులు, రసాయనాలు, కోగ్యులెంట్లు వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. అవి బయటి నుండి నిజమైనవిగా కనిపించవచ్చు. కానీ వాటిలో పోషకాలు ఉండవు. అంతేకాకుండా వాటిలో ఉండే రసాయనాలు హానికరం కావచ్చు.
నకిలీ గుడ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు
రసాయనాలతో తయారు చేసిన నకిలీ గుడ్లు కడుపు నొప్పి, అలెర్జీలు, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఎక్కువ కాలం తినడం వల్ల శరీరంలో రసాయనాలు పేరుకుపోతాయి. ఇది తరువాత తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
వాటర్ టెస్ట్
గుడ్లు కల్తీవా కాదా అని తెలుసుకోవాటిని వాటర్ టెస్ట్ చేయండి. ఒక గిన్నెలో నీరు పోసి గుడ్డును సున్నితంగా అందులో పెట్టండి. తాజా గుడ్డు అయితే అడుగుకు మునిగి అడ్డంగా పడుకుంటుంది. కొంచెం పాతదైతే అడుగున నిలువుగా ఉంటుంది. కానీ తేలియాడే గుడ్డు (ఫ్లోటింగ్) పాతది లేదా పాడైపోయిందని అర్థం.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
జాగ్రత్త.. ఈ 4 సమస్యలు ఉన్నవారు ఎండు కొబ్బరి అస్సలు తినకూడదు.!
పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో ఉంచితే ఈ వ్యాధులు నయం.!
For More Latest News