Dry Coconut Side Effects: జాగ్రత్త.. ఈ 4 సమస్యలు ఉన్నవారు ఎండు కొబ్బరి అస్సలు తినకూడదు.!
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:35 PM
ఎండిన కొబ్బరి పోషకాల నిధి. కానీ, ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని వంటలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కొబ్బరిలో అనేక పోషకాలు ఉంటాయి. అలసట, బలహీనతతో బాధపడేవారికి ఎండిన కొబ్బరి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే, ఎండిన కొబ్బరి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎండిన కొబ్బరి తీసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వ్యక్తులు ఎండు కొబ్బరి తినకూడదు..!
జీర్ణ సమస్యలు ఉన్నవారు:
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు ఎండు కొబ్బరి తినడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, ఎండు కొబ్బరిని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, గుండెల్లో మంట, గ్యాస్ ఏర్పడుతుంది. ఇది మలబద్ధకాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల, సున్నితమైన జీర్ణ వ్యవస్థలు ఉన్నవారు, IBSతో బాధపడేవారు ఎండు కొబ్బరి తినకపోవడం మంచిది.
బరువు తగ్గాలనుకునేవారు:
ఎండిన కొబ్బరిలో కేలరీలు, కొవ్వు ఉంటాయి. అందువల్ల, బరువు తగ్గాలనుకునేవారు దీనిని తినకూడదు. ఎండిన కొబ్బరి తినడం వల్ల బరువు పెరుగుతారు. మీరు బరువు తగ్గాలనుకుంటే, ఎండిన కొబ్బరిని తినకుండా ఉండండి.
గుండె జబ్బు ఉన్నవారు:
ఎండిన కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే, కొబ్బరిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బు ఉన్నవారికి హాని కలుగుతుంది. కాబట్టి, గుండె సమస్య ఉన్నవారు ఎండిన కొబ్బరిని తినకుండా ఉండాలి.
డయాబెటిస్
ఎండిన కొబ్బరిలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, మధుమేహం ఉన్నవారు ఎండిన కొబ్బరిని తినకుండా ఉండాలి.
గుర్తుంచుకోవలసిన విషయాలు
చిన్న పిల్లలు ఎండు కొబ్బరి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద ముక్కలు గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది.
దగ్గుతో బాధపడేవారు ఎండు కొబ్బరిని తినకుండా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఆరోగ్య నిపుణుల ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో ఉంచితే ఈ వ్యాధులు నయం.!
తండ్రిని చంపిన ఏనుగును.. ఆ పిల్లలు ఏం చేశారంటే..
For More Latest News