Share News

Ro-Ko: రో-కోతో గంభీర్ సమావేశం?

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:38 AM

టీమిండియా స్టార్‌ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

Ro-Ko: రో-కోతో గంభీర్ సమావేశం?
Ro-Ko

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ త్వరలో ఓ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి బీసీసీఐ(BCCI) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రో-కో(Ro-Ko) ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.


అందుకేనా?

రో-కో 2027 వన్డే ప్రపంచ కప్(WC 2027) ఆడటం కోసమే ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకలేదనేది అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ఈ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని సమాచారం. ప్రపంచ కప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్లయితే.. దేశవాళీ టోర్నీల్లో ఆడటం, ఫిట్‌నెస్-ఫామ్ కాపాడుకోవడం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మీడియాలో వచ్చే ఊహాగానాల గురించి పక్కన పెట్టి.. జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడటం గురించి వారికి గంభీర్, అగార్కర్ సూచనలు చేయనున్నట్లు సమాచారం. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం అహ్మదాబాద్‌లో నిర్వహించే ఈ సమావేశంలో కెప్టెన్ శుభ్‌మన్ గి(Gill)ల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.


నేటి నుంచే..

నేటి(ఆదివారం) నుంచి సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాంచి వేదికగా జరగనుంది. కెప్టెన్ గిల్, శ్రేయస్, బుమ్రా, సిరాజ్.. వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు అధికారికంగా దూరమయ్యారు. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రాకతో జట్టు బలం పెరిగిందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికాతో టెస్టులో వైట్ వాష్ అయిన భారత్.. ఈ వన్డే సిరీస్ పట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది.


ఇవి కూడా చదవండి:

కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం

పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?

Updated Date - Nov 30 , 2025 | 06:38 AM