Mohsin Naqvi: ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏమిటి?.. నఖ్వికి చేదు అనుభవం
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:41 PM
ఇటీవల ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వి చేసిన పనికి ఆ దేశం పరువు పోయింది. ఆసియా కప్ విన్నర్ అయిన భారత్‌కు ట్రోఫీని నఖ్వీ అప్పగించక పోవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న మోసిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడాన్ని భారత్ తిరస్కరించింది..
ఇటీవల ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వి చేసిన పనికి ఆ దేశం పరువు పోయింది. ఆసియా కప్ విన్నర్ అయిన భారత్‌కు ట్రోఫీని నఖ్వీ అప్పగించక పోవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న మోసిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడాన్ని భారత్ తిరస్కరించింది. దీంతో ఆ కప్ ను తన వెంట తీసుకెళ్లడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లిన ఆసియా కప్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
వారం రోజుల క్రితం జరిగిన పాక్ క్రికెటర్ అక్బర్ అహ్మద్(Abrar Ahmed) పెళ్లిలోనూ నఖ్వికి ఆసియా కప్ ట్రోఫీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. కరాచిలో జరిగిన పాక్ స్పినర్ అక్బర్ వివాహానికి హాజరైన మోసిన్ నఖ్వి(Mohsin Naqvi)ని.. ఆసియా కప్ ఎక్కడ ఉందంటూ విలేకర్లు అడిగారు. అలానే "ఆసియా కప్ ట్రోఫీ(Asia Cup Trophy) భవిష్యత్తు ఏమిటి?" అని మరో విలేకరి అడిగాడు. అయితే వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా నఖ్వి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు పాకిస్థాన్ పేషర్ షాహీన్ అఫ్రీది.. నఖ్విని రిపోర్టర్ల నుంచి తప్పించి ఆయన కారు వద్దకు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఆసియా కప్ ట్రోఫీని విజేతగా నిలిచిన భారత జట్టుకు అప్పగించడానికి నిరాకరించడం ద్వారా నఖ్వీ బాధ్యతల నియమావళి, ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బీసీసీఐ కూడా ఆయనపై అభిశంసనకు ఐసీసీపై ఒత్తిడి తెస్తోంది. ఆయనను తొలగించాలనే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నఖ్వి వరుసగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతోనే బీసీసీఐ(BCCI) ఈ డిమాండ్ చేసినట్లు సమాచారం. అలానే నఖ్వి చర్యలు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) , ఐసీసీ రెండింటికీ క్రికెట్ పరిపాలన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని బీసీసీఐ అభిప్రాయపడింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ విజయం గంభీర్ ది కాదు: రోహిత్
టెస్టు ర్యాంకింగ్స్.. సిరాజ్, జడేజాకు అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..