Ravindra Jadeja 6th Century: ఇండియా vs విండీస్ మ్యాచులో ఆరో సెంచరీ చేసిన జడేజా.. ధోని రికార్డుతో..
ABN , Publish Date - Oct 03 , 2025 | 04:53 PM
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ ప్రతిభతో మళ్లీ మ్యాజిక్ చేశాడు. కేవలం 168 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసి, తన కెరీర్‌లో ఆరో సెంచరీని సాధించాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన సెంచరీ (Ravindra Jadeja 6th Century) సాధించాడు. అతను కేవలం 168 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతని కెరీర్‌లో ఆరో టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీతో మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును జడేజా సమం చేశాడు. ధోని కూడా టెస్ట్ క్రికెట్‌లో ఆరు సెంచరీలు సాధించాడు.
ఇప్పుడు జడేజా దృష్టి లెజెండరీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ రికార్డుపై ఉంది. పంత్ టెస్ట్ క్రికెట్‌లో ఏడు సెంచరీలు సాధించాడు. జడేజా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కసరత్తు చేస్తున్నాడు.
అత్యధిక సిక్స్ హిట్టర్ల లిస్టులో
ఈ ఘనతతో మహేంద్ర సింగ్ ధోని రికార్డును జడేజా సమం చేశాడు. ధోని కూడా ఆరు టెస్ట్ సెంచరీలు చేశాడు, కానీ జడేజా సిక్సర్ల పరంగా భారత మాజీ కెప్టెన్‌ను అధిగమించాడు. జడేజా ఇప్పటివరకూ 7,213 బంతులను ఎదుర్కొని 78 సిక్సర్లు చేశాడు.
మహేంద్ర సింగ్ ధోని 8,104 బంతుల్లో 76 సిక్సర్లు బాదాడు. దీంతో జడేజా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్స్ హిట్టర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ 91, రిషబ్ పంత్ 90, సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 88 సిక్సర్లతో మూడో స్థానంలో కలడు.
మూడో రోజు ఎలా..
రవీంద్ర జడేజా తన సెంచరీ పూర్తి చేసిన కొన్ని నిమిషాలకే అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి, తమ ఆధిక్యాన్ని 286 పరుగులకు పెంచుకుంది. క్రీజులో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఉన్నారు.
గిల్ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కేఎల్ రాహుల్, ధృవ్ జురేల్, జడేజా శతకాలు.. స్కోర్ పెరిగేందుకు సపోర్టుగా నిలిచాయి. వెస్టిండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. మూడో రోజు ఉదయం భారత్ డిక్లేర్ చేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. చివరి రోజు వర్షం వచ్చే అవకాశం ఉన్నందున, భారత జట్టు మరోసారి బ్యాటింగ్ చేసి డిక్లేర్ చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి