Share News

Ravi Bishnoi: రోహిత్-కోహ్లీకి సరైన వీడ్కోలు దక్కలేదు.. బాధనిపించింది

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:18 PM

భారత క్రికెట్‌కు సేవలందించిన గొప్ప దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వీడ్కోలు చెప్పిన తీరుపై యువ క్రికెటర్ రవి బిష్ణోయ్ బాధను వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఎన్నో విజయాలను అందించిన ఈ ఇద్దరికి ముగింపు మరింత ఘనంగా, గౌరవ ప్రదంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

Ravi Bishnoi: రోహిత్-కోహ్లీకి సరైన వీడ్కోలు దక్కలేదు.. బాధనిపించింది
Ravi Bishnoi Rohit Sharma

భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు టీ20, టెస్ట్ ఫార్మాట్‌ విషయంలో సరైన వీడ్కోలు దక్కకపోవడం తనను బాధించిందని భారత జట్టు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) అన్నారు. ఈ ఇద్దరూ టీమిండియాకు ఎంతో గొప్పగా ఆడారు కనుక, అభిమానుల ముందే మైదానంలో వీరికి వీడ్కోలు పలికి ఉంటే బాగుండేదని బిష్ణోయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

టెస్టులు, టీ20లు..

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ విరాట్, రోహిత్ శర్మలకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని సాధించగా, వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. కానీ ఆ టోర్నీ తర్వాత వారు అకస్మాత్తుగా టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ వచ్చింది.


వీరిద్దరి రిటైర్మెంట్..

ఇలాంటి దిగ్గజాలకు మైదానంలో అభిమానుల సమక్షంలోనే వీడ్కోలు చెబితే బాగుంటుందని ఓ ఇంటర్వ్యూలో తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు బిష్ణోయ్. వారిద్దరూ భారత క్రికెట్‌కి చేసిన సేవకు సరిగ్గా సరిపడే ఫెయిర్‌వెల్ ఇవ్వాల్సిందని భావించారు. వీరిద్దరి రిటైర్మెంట్ తీరును షాకింగ్ అని అభివర్ణించిన బిష్ణోయ్, వారు లేకపోవడం భారత జట్టులో ఖాళీగా ఉన్న రెండు పెద్ద స్థానాల్లా అనిపిస్తోందన్నాడు. ఈ క్రమంలో వారి స్థానాలు భర్తీ చేయడం అంత ఈజీ కాదని వెల్లడించాడు.


వన్డేల్లో వీడ్కోలు ఆశ

రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో తిరిగి ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారని, అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనబోతున్నారని తెలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకుని, ఈ దిగ్గజాలు మళ్లీ జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి గొప్ప క్రికెటర్ల ప్రస్థానం మళ్లీ మైదానంలో ఒకసారి చూసి వీడ్కోలు పలికితే, అది ప్రతి క్రికెట్ ప్రేమికుడి మనసు గెలిచేదని బిష్ణోయ్ అన్నారు. ఈ నేపథ్యంలో వన్డేల్లో అయినా వీరికి సరైన వీడ్కోలు లభించాలని బిష్ణోయ్ అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 09:18 PM