Kushi Mukherjee: ఫ్రెండ్స్‌లా కూడా మాట్లాడుకోవద్దా?.. సూర్యపై చేసిన వ్యాఖ్యలపై నటి క్లారిటీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 02:11 PM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనకు పదే పదే మెసేజ్ చేసేవాడంటూ బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖుషీ వివరణ ఇచ్చుకుంది. క్రికెటర్ సూర్య ఫ్రెండ్లీగానే మెసేజ్ చేసేవాడని, తమ మధ్య ఇతర రిలేషన్స్ ఏవీ లేవని స్పష్టత ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సూర్య తనకు పదే పదే మెసేజ్ చేసేవాడంటూ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖుషీ(Kushi Mukherjee) వివరణ ఇచ్చుకుంది. క్రికెటర్ సూర్య ఫ్రెండ్లీగానే మెసేజ్ చేసేవాడని, తమ మధ్య ఇతర రిలేషన్స్ ఏవీ లేవని స్పష్టత ఇచ్చింది.
అసలేమైందంటే..?
మీరు ఏ క్రికెటర్‌తో అయినా డేటింగ్ చేయాలనుకుంటున్నారా? అని ఓ మీడియా ఈవెంట్‌లో ఖుషీకి ప్రశ్నకి ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ.. ‘నేను ఏ క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని అనుకోవడం లేదు. అయితే సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) మాత్రం గతంలో నాకు తరచూ మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేం కాంటాక్ట్‌లో లేము. నన్ను ఎవరితోనూ లింక్ చేసి మాట్లాడటం నాకు నచ్చదు’ అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. ఆమెదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
‘మా మధ్య ఏమీ లేదు. స్నేహితుల్లా కూడా మేం మాట్లాడుకోవద్దా? కేవలం మేం స్నేహితులం మాత్రమే. ఆ సమయంలో తను ఓ మ్యాచ్ ఓడిపోయాడు. అది నన్ను ఎంతో బాధించింది. అప్పుడే మెసేజ్‌లు చేసుకున్నాం. అంతకి మించి ఏమీ లేదు. అతడు నాకు మంచి స్నేహితుడు మాత్రమే’ అని స్పందించింది.
ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్ కప్ (ICC Mens T20 World Cup) 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సూర్యను వరుస వైఫల్యాలు ఇబ్బంది పెడుతున్నాయి. అతడు వీలైనంత త్వరగా తన రిథమ్‌లోకి వచ్చి, పూర్వపు ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఖుషీ ముఖర్జీ తెలుగులో రెండు సినిమాలు (దొంగ ప్రేమ, హార్ట్ అటాక్) చేసింది. పలు రియాల్టీ షోల్లో మెరిసిన ఆమె.. తన బోల్డ్ లుక్స్, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.
ఇవీ చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?
కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!