SMAT 2025 Final: ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. జార్ఖండ్ భారీ స్కోర్
ABN , Publish Date - Dec 18 , 2025 | 07:07 PM
పుణె వేదికగా గురువారం హరియాణ, జార్ఖండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మరికాసేపట్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హరియాణాతో టైటిల్ పోరులో టాస్ ఓడిన జార్ఖండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో జార్ఖండ్ జట్టు భారీ స్కోర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ( Syed Mushtaq Ali Trophy 2025) ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం హరియాణ, జార్ఖండ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మరికాసేపట్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హరియాణాతో టైటిల్ పోరులో టాస్ ఓడిన జార్ఖండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో జార్ఖండ్ జట్టు భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి.. బ్యాటింగ్ దిగిన జార్ఖండ్(Jharkhand) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ విరాట్ సింగ్(2) విఫలం కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హరియాణా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాతా అదే జోరు కొనసాగించి.. 45 బంతుల్లోనే శతకం(Ishan Kishan Century) పూర్తిచేశాడు. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 6 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్ కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ ఔటయ్యాడు.
మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు. రాబిన్ మింజ్ 14 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. వీరికి తోడు అంకుల్‌రాయ్ 40 పరుగులతో రాణించడంతో జార్ఖండ్.. హరియాణా ముందు 263 పరుగుల(Jharkhand 262 runs) భారీ టార్గెట్‌ను ఉంచింది. ఇక హరియాణా బౌలర్లలో ఇషాంత్ భరద్వాజ్, సుమిత్ కుమార్, అమిత్ రాణా తలో వికెట్ తీసుకున్నారు. భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన హరియాణా తడబడుతోంది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ డకౌట్ అయ్యాడు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్ వివాదం.. స్పందించిన ఐసీసీ