Share News

MI vs SRH Match Live Updates: సన్‌రైజర్స్‌పై ముంబై విజయం

ABN , First Publish Date - Apr 17 , 2025 | 07:10 PM

IPL 2025 MI vs SRH Match Live Updates in Telugu: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు టఫ్ టీమ్స్‌ మధ్య ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

MI vs SRH Match Live Updates: సన్‌రైజర్స్‌పై  ముంబై విజయం
IPL 2025 MI vs SRH

Live News & Update

  • 2025-04-17T23:23:50+05:30

    • హైదరాబాద్‌పై 4 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

    • 18.1 ఓవర్లలో 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై

  • 2025-04-17T23:19:53+05:30

    • 17వ ఓవర్‌లో హార్దిక్ వరుసగా రెండు బౌండరీలు(6,4)

    • 18వ ఓవర్‌లో ముంబైతో దోబూచులాడిన విజయం

    • ఎషాన్ బౌలింగ్‌లో రెండు వికెట్లు (హార్దిక్, నమన్ ధీర్) కోల్పోయిన ముంబై

  • 2025-04-17T23:09:25+05:30

    16 ఓవర్లకు ముంబై స్కోరు 146/4, విజయం దిశగా అడుగులు

  • 2025-04-17T22:58:45+05:30

    ముంబై నాలుగో వికెట్ డౌన్

    • మరో వికెట్ తీసిన కమిన్స్

    • 15వ ఓవర్‌లో జీషాన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (36) ఔట్

    • 15 ఓవర్లకు ముంబై స్కోరు 137/4

  • 2025-04-17T22:58:44+05:30

  • 2025-04-17T22:54:08+05:30

    • 14వ ఓవర్‌లో హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్

    • ముంబై స్కోరు 127/3; విల్ జాక్స్ (36) తిలక్ వర్మ (3)

  • 2025-04-17T22:46:24+05:30

    మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

    • కమిన్స్ వేసిన బంతికి (12.5) జీషాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య కుమార్ (26) ఔట్

    • 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 122/3

  • 2025-04-17T22:42:09+05:30

    నిలకడగా ఆడుతున్న ముంబై

    • 12వ ఓవర్‌లో ఎషాన్ బౌలింగ్

    • విల్ జాక్స్ (34), సూర్యకుమార్ యాదవ్ (22)

    • 12 ఓవర్లకు స్కోరు 117/2

  • 2025-04-17T22:35:28+05:30

    • 11వ ఓవర్‌లో జీషాన్ బౌలింగ్, ముంబైకి 15 పరుగులు

    • ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 106/2

    • విల్ జాక్స్ (29), సూర్యకుమార్ యాదవ్ (17)

  • 2025-04-17T22:31:57+05:30

    • 10 ఓవర్లకు ముంబై స్కోరు 91/2

    • క్రీజులో జాక్స్ (22), సూర్య కుమార్ (9)

  • 2025-04-17T22:20:15+05:30

    ముంబైకి షాక్.. రికెల్‌టన్ (31) ఔట్

    • హర్షల్ బౌలింగ్‌లో (7.5) ట్రావిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్

    • క్రీజులో సూర్య కుమార్ యాదవ్

    • 8 ఓవర్లకు ముంబై స్కోరు 70/2

  • 2025-04-17T22:12:51+05:30

    జీషాన్ బౌలింగ్‌లో రికెల్‌టన్‌కు లైఫ్

    • కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి చిక్కుల్లో పడ్డ రికెల్‌టన్, నో బాల్‌గా ప్రకటించడంతో లైఫ

    • 7వ ఓవర్‌కు ముంబై స్కోరు 59/1

    • రికెల్‌టన్ (22), జాక్స్ (8)

  • 2025-04-17T22:03:43+05:30

    వరుస ఫోర్లతో విరుచుపడ్డ రికెల్‌టన్

    • ఇషాన్ బౌలింగ్‌లో (5.2,5.3,5.4) హ్యాట్రిక్ ఫోర్లు

    • 6 ఓవర్ల తరువాత ముంబై స్కోరు 55/1

    • రికెల్‌టన్ (21), జాక్స్ (7)

  • 2025-04-17T21:54:01+05:30

    ముంబైకి తొలి షాక్.. రోహిత్ ఔట్

    • కమిన్స్ బౌలింగ్‌లో (3.5) కవర్స్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించి ట్రావిస్‌కు దొరికిపోయిన వైనం

    • 4 ఓవర్లకు ముంబై స్కోరు 32/1

  • 2025-04-17T21:48:59+05:30

    • కట్టుదిట్టంగా కమిన్స్ బౌలింగ్

    • రెండు ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 7/0

    • రోహిత్ (2), రికెల్‌టన్ (4)

  • 2025-04-17T21:41:13+05:30

    మొదలైన ముంబై ఇన్నింగ్స్

    • ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ ఎంట్రీ

    • క్రీజులో రోహిత్‌‌తో పాటు రికెల్‌టన్

  • 2025-04-17T21:18:05+05:30

    • వాంఖడే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లకు 162 రన్స్ చేసింది.

    • చివర్లో అనికేత్ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్) చెలరేగడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది సన్‌రైజర్స్.

    • పిచ్ నుంచి మంచి బౌన్స్ లభిస్తోంది. స్లో డెలివరీస్‌కు పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఆపసోపాలు పడుతున్నారు.

    • ఈ వికెట్‌పై చేజింగ్ అంత ఈజీ కాదు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు.

  • 2025-04-17T21:07:53+05:30

    రెచ్చిపోయిన క్లాసెన్

    • సన్‌రైజర్స్ పించ్ హిట్టర్ క్లాసెన్ చెలరేగిపోయాడు.

    • స్లో పిచ్‌పై సహచరులు పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో క్లాసెన్ గేర్లు మార్చాడు.

    • దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 21 పరుగులు పిండుకున్నాడు క్లాసెన్. ఏకంగా 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు.

    • ప్రస్తుతం సన్‌రైజర్స్ స్కోరు 18 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 136.

  • 2025-04-17T21:03:22+05:30

    • ముంబైతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

    • ఒకవైపు పరుగులు రాక, మరోవైపు వరుసగా వికెట్లు పడుతుండటంతో ఎస్‌ఆర్‌హెచ్ దిక్కుతోచని స్థితిలో ఉంది.

    • 17 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ స్కోరు 4 వికెట్లకు 115.

    • క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన నితీష్ కుమార్ రెడ్డి (19)ని బౌల్ట్ చక్కటి స్లో డెలివరీతో ఔట్ చేశాడు బౌల్ట్.

  • 2025-04-17T20:39:03+05:30

    ట్రావిస్ హెడ్ ఔట్..

    • ఎస్ఆర్‌హెచ్‌కు ఏమైంది.

    • అటు స్కోర్ లేదు.. ఇటు వికెట్లు సమర్పించుకుంటోంది.

    • మూడో వికెట్‌ డౌన్ అయ్యింది.

    • ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు.

    • ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 91/3, 13 ఓవర్లు కంప్లీట్.

    • క్రీజులో నితీష్ రెడ్డి, క్లాసెన్ ఉన్నారు.

  • 2025-04-17T20:16:45+05:30

    మరో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్..

    • ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ అయ్యాడు.

    • 3 బాల్స్ ఆడిన కిషన్.. 2 పరుగులు చేశాడు.

    • ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 68/2

  • 2025-04-17T20:14:12+05:30

    • సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది.

    • ఫోర్లతో అలరించిన అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) ఔట్ అయ్యాడు.

  • 2025-04-17T20:11:09+05:30

    • ముంబై ఇండియన్స్ చెత్త ఫీల్డింగ్‌తో పలు కీలక అవకాశాలను మిస్ చేసుకుంది.

    • అభిషేక్ శర్మ-ట్రావిస్ హెడ్ ఇచ్చిన పలు 3 క్యాచుల్ని ముంబై ఫీల్డర్లు జారవిడిచారు.

    • క్యాచులు జారవిడవడమే గాక గ్రౌండ్‌ ఫీల్డింగ్‌లో రన్స్ లీక్ చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంది ముంబై.

  • 2025-04-17T20:08:43+05:30

    రోహిత్‌కు బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్

    • ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది.

    • ఐపీఎల్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గానూ అతడ్ని ఓ జ్ఞాపికతో సత్కరించింది బీసీసీఐ.

    • సన్‌రైజర్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ స్పెషల్ గిఫ్ట్‌ను హిట్‌మ్యాన్‌కు అందించాడు.

  • 2025-04-17T19:57:16+05:30

    • వాంఖడే పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు నింపాదిగా ఆడుతున్నారు.

    • ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కాస్తా బౌలింగ్‌కు సహకరించడం, బంతి పిచ్ అయ్యాక బ్యాట్ మీదకు స్లోగా వస్తుండటంతో రన్స్ చేసేందుకు ఎస్‌ఆర్‌‌హెచ్ బ్యాటర్లు ఆపసోపాలు పడుతున్నారు.

    • బౌల్ట్, బుమ్రా పిచ్ నుంచి మంచి బౌన్స్ రాబడుతూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు.

    • 5 ఓవర్లు ముగిసేసరికి కమిన్స్ సేన వికెట్లేమీ కోల్పోకుండా 43 పరుగులతో ఉంది.

    • అభిషేక్ శర్మ 34 నాటౌట్, ట్రావిస్ హెడ్ 6 నాటౌట్ క్రీజులో ఉన్నారు.

  • 2025-04-17T19:13:14+05:30

    ఎస్ఆర్‌హెచ్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-17T19:13:13+05:30

    ముంబై ఇండియన్స్ టీమ్ ఇదే..

  • 2025-04-17T19:10:35+05:30

    టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..

    • ఫీల్డింగ్ ఎంచుకున్న ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య.

    • బ్యాటింగ్‌కు రానున్న సన్ రైజర్స్ హైదరాబాద్.