IND vs SA: టాస్ మరింత ఆలస్యం.. ఎందుకంటే..
ABN , Publish Date - Dec 17 , 2025 | 07:58 PM
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నాలుగో టీ20లో టాస్ ఆలస్యంగా పడనుంది. లక్నో నగరంలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్ ఆలస్యంగా పడనుంది. లక్నో నగరంలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడాల్సిఉండగా ఆలస్యమైంది. 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేశారు. దీంతో అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్ పరిస్థితిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో చివరి రెండు టీ20లకు శుభ్‌మన్ గిల్ దూరం అయ్యాడు. కాలికి గాయం కారణంగా నాలుగు, ఐదు టీ20లకు దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను రీప్లేస్‌మెంట్‌గా బీసీసీఐ ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. ఐదో టీ20 మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం