Share News

IND VS SA: స్టార్ బౌలర్ ఎంట్రీ.. నాలుగో టీ20 భారత తుది జట్టు ఇదే!

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:57 PM

ఇవాళ(బుధవారం)సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో రానున్నాడని సమాచారం.

IND VS SA: స్టార్ బౌలర్ ఎంట్రీ.. నాలుగో టీ20 భారత తుది జట్టు ఇదే!
India vs South Africa 4th T20

ఇంటర్నెట్ డెస్క్: ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇవాళ(బుధవారం) భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20(India vs South Africa 4th T20) జరగనుంది. లక్నోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Bumrah) అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలానే సంజూ శాంసన్ కు మళ్లీ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తుంది.


మూడో టీ20కు ముందు జస్ప్రీత్ బుమ్రా స్నేహితుడు ఒకరు ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో వెంటనే బుమ్రా ముంబైకి వెళ్లాడు. దీంతో మూడో టీ20కి అతడు దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణా బరిలో దిగాడు. ఇక ఇవాళ జరిగే నాలుగో టీ20కు బుమ్రా అందుబాటులో ఉండవచ్చని శివం దూబే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. అయితే టీమ్ మెనెజ్‌మెంట్ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బుమ్రా వస్తే హర్షిత్ కు తుది జట్టులో స్థానం లభించదు. ఒకవేళ బుమ్రా ఆడకపోతే హర్షిత్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించనున్నారు. మూడో వన్డేలో బుమ్రా స్థానంలో వచ్చిన హర్షిత్(Harshit Rana) చక్కగా రాణించాడు. క్వింటన్ డి కాక్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక వికెట్లు తీసి.. దక్షిణాఫ్రికా ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. భారత్ ఎటువంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్ ఆడినే జట్టునే లక్నోలోనూ కొనసాగించనుంది.


లక్నో వంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జోడీ మరోసారి కీలకంగా మారనున్నారు. మరోవైపు సంజూ శాంసన్(Sanju Samson out) ఈ మ్యాచ్‌కూ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రొటీస్ జట్టులో మరోసారి మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఆ మార్పులు ఎలాంటివి అనేది మాత్రం బయటకు రాలేదు. డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి రానున్నాడన సమాచారం.అయితే నాలుగో టీ20 మ్యాచ్ జరిగే లక్నో(Lucknow T20 match)లో సాయంత్రం వాతావరణం చల్లగా, పొగమంచుతో కూడి ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభంలోనే మంచు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వేదికపై ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌లలో సాధారణ స్కోర్లు నమోదయ్యాయి. పేసర్లకు బంతి ప్రారంభంలో కొంత సహకరించినప్పటికీ, స్పిన్నర్లకు మాత్రం పెద్దగా మద్దతు లభించలేదు.


తుది జట్లు(అంచనా)

దక్షిణాఫ్రికా:

క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్‌క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ఎన్రిక్ నోర్ట్జే, ఓట్నీల్ బార్ట్‌మాన్

భార‌త్‌:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా/ వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి


ఇవి కూడా చదవండి:

Ashes 2026:నల్ల బ్యాడ్జీలతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు.. కారణం ఇదే..!

అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.. రవి బిష్ణోయ్

Updated Date - Dec 17 , 2025 | 04:57 PM