Share News

MLAs Defection Case: పార్టీ మారినట్లు ఆధారాల్లేవు.. స్పీకర్ కీలక తీర్పు..

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:48 PM

రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పునిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు.

MLAs Defection Case: పార్టీ మారినట్లు ఆధారాల్లేవు.. స్పీకర్ కీలక తీర్పు..
MLAs defection case

హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పునిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారిపై అనర్హత వేటు వేసేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు చూపలేదని తీర్పు సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ లు తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయంలో స్పీకర్ ఆలస్యం చేస్తుండటంతో.. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై పలు దఫాలుగా విచారించిన సుప్రీం ధర్మాసనం.. డిసెంబర్ 18వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.


సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఇవాళ(బుధవారం) ఐదుగురు ఎమ్మె్ల్యేల కేసులో తీర్పును వెలువరించారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌కు సంబంధించిన పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టమైన తీర్పునిచ్చారు. పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు.

ఇక, మిగిలిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో గురువారం నాడు తీర్పు వెలువరించనున్నారు స్పీకర్. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలను ఇంకా విచారించాల్సి ఉంది. వీరికి స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారింది.


Also Read:

నాన్నా.. నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. కూతురి మాటలకు తండ్రి రియాక్షన్ ఏంటంటే..

స్టార్ బౌలర్ ఎంట్రీ.. నాలుగో టీ20 భారత తుది జట్టు ఇదే!

Updated Date - Dec 17 , 2025 | 05:03 PM