Boyfriend: నాన్నా.. నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. కూతురి మాటలకు తండ్రి రియాక్షన్ ఏంటంటే..
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:59 PM
తండ్రి నుంచి లభించే ప్రేమ, భద్రత, విశ్వాసం కూతురికి ఎంతో భరోసా కల్పిస్తాయి. ఏ విషయమైనా తల్లి కంటే ముందు తండ్రితోనే చెప్పే అమ్మాయిలు ఎందరో ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తండ్రీ కూతుళ్ల బంధం చాలా మందిని ఆకట్టుకుంటోంది.
సాధారణంగా కూతుళ్లు తల్లి కంటే తండ్రితో ఎక్కువ ఆత్మీయంగా ఉంటారు. తండ్రి నుంచి లభించే ప్రేమ, భద్రత, విశ్వాసం కూతురికి ఎంతో భరోసా కల్పిస్తాయి. ఏ విషయమైనా తల్లి కంటే ముందు తండ్రితోనే చెప్పే అమ్మాయిలు ఎందరో ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తండ్రీ కూతుళ్ల బంధం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో యువతి తన బాయ్‌ఫ్రెండ్ గురించి తండ్రితో మాట్లాడుతోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (daughter tells father about boyfriend).
@driiiishtiiii అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆ అమ్మాయి తన తండ్రి ముందు కూర్చుని అతడి చేయి పట్టుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. కూతురి భయాన్ని గ్రహించిన తండ్రి ఆమె మాట్లాడే వరకు నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు. చివరకు ఆ అమ్మాయి వణుకుతున్న గొంతుతో, 'నాన్నా, చాలా సంవత్సరాలుగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చెబుతున్నాను. నాకు 11 సంవత్సరాలుగా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు' అని చెప్పింది (viral father daughter video).
కూతురి మాటలు విన్న తండ్రి కోపం లేదా ఆందోళనకు గురి కాకుండా.. చాలా ప్రేమతో స్పందించాడు (emotional father reaction). 'ఇది చాలా సాధారణ విషయం. ఇందులో ఆందోళన చెందడానికి ఏముంది?' అని సముదాయించాడు. దీంతో కూతురి మరింత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తన ప్రియుడు వివేక్ గురించి మరిన్ని విషయాలను తండ్రితో పంచుకుంది. ఆ విషయాలన్నీ తనకు ముందుగానే తెలుసని తండ్రి మరింత షాకిచ్చాడు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..